»   » అట్టర్ ప్లాప్ అట... అనే టాక్‌ను తెచ్చుకోలేదు

అట్టర్ ప్లాప్ అట... అనే టాక్‌ను తెచ్చుకోలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అట్టర్ ప్లాప్ అట... అనే టాక్‌ను నేనెప్పుడూ తెచ్చుకోలేదు. నేనిప్పటి వరకు చేసిన సినిమాలతో సందీప్ సినిమాలంటే ఫర్వాలేదనే అనిపించుకున్నాను. నెగటివ్ కేరక్టర్ నుంచి ముగ్గురు హీరోల్లో ఒకడిగా.. అక్కడ నుంచి ఇప్పుడు సోలో హీరోగా క్రమంగా ఎదుగుతున్నాను అన్నారు సందీప్ కిషన్. ఆయన హీరోగా నటించిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' ఈ నెల 29న విడుదల కానుంది. చిత్రం విడుదల సందర్భంగా సందీప్ కిషన్ మీడియాతో మాట్లాడారు.

అలాగే... "ఐదేళ్ల క్రితం నేను ఫోటోలు పట్టుకుని ఆఫీసులన్నీ తిరిగాను. ఇవాళ నేను రిజక్ట్ చేస్తున్న సబ్జెక్టుల్లో ప్రాధాన్యత లేని పాత్ర దొరికినా చేసే రోజులు అవి. ఆ రోజుల్ని మర్చిపోలేను. అందుకే నా వద్దకు వచ్చిన ప్రతి పాత్రను, ప్రతి కథను ఆచి తూచి ఎంపిక చేసుకుంటున్నాను. స్విస్‌బ్యాంక్‌లాంటి ఛోటా.కె.నాయుడు మామ తొలి సారి నా సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది'' అని అంటున్నారు సందీప్‌కిషన్.

 Venkatadri Express

కథ గురించి చెప్తూ... ఈ సినిమా గురించి ఒక్కమాటలో చెప్పమంటే ఆ నలుగురు సినిమాను పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో మా సినిమా అచ్చం అలాగే ఉంటుంది. చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు, మా సినిమాకూ ఏ సంబంధమూ లేదు. మా కథను క్లుప్తంగా చెప్పాలంటే స్ట్రిక్ట్ ఫాదర్‌కి నేను రెండో కొడుకుని. వంద తప్పులు చేస్తే ఇంటి నుంచి వెళ్లిపోవాలి. నేనప్పటికే 99 తప్పులు చేసేస్తాను. తెల్లారితే అన్నయ్య పెళ్లి. తిరుపతికి వెళ్ళాల్సిన ట్రైన్ మిస్ అవుతాను. మరి పెళ్లికి వెళ్లానా? లేదా? దాని వల్ల జరిగిన పరిణామాలేమిటన్నదే ఈ సినిమా.

మేర్లపాక గాంధి వండర్‌ఫుల్ స్క్రిప్ట్ చెప్పాడు. తను ప్రాపర్‌గా ఫిల్మ్‌మేకింగ్ చదివి, షార్ట్ ఫిల్మ్స్ తీసి ఈ సినిమాకు కథను ప్రిపేర్ చేసుకున్నాడు. మెచ్యూరిటీ, పేషన్స్ ఉన్న దర్శకుడు. ఆనంది ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చారు. మా మామ ఛోటా.కె.నాయుడు కెమెరా, రమణ గోగులగారి సంగీతం.. ఇలా అన్నీ కుదిరాయి ఈ సినిమాకి. క్లీన్ యు వచ్చింది. నరేష్ వాయిస్ ఓవర్ చెప్పారు.


కథ మీద నమ్మకంతో నా మార్కెట్‌ని మించి ఖర్చుపెట్టారు నిర్మాత. మేకింగ్ రిచ్‌నెస్ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. పాటలకు, ట్రైలర్లకు ఇప్పటికే మంచి స్పందన వస్తోంది. ష్యూర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా హిట్ అనేది నా జడ్జ్‌మెంట్ మీద నాకున్న నమ్మకాన్ని బలపరుస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమా నేను చేస్తున్న తొలి పక్కా కమర్షియల్ హీరో సినిమా.

తెలుగులో నేను ట్రై చేయలేని పాత్రలను అటు హిందీలోనూ, తమిళ్‌లోనూ చేస్తున్నాను. తమిళం నుంచి తెలుగులోకి అనువాదమైన మహేష్ నాకు ఇక్కడ పెద్దగా సంతృప్తిని కలిగించలేదు. ఇకపై నేను తమిళ్‌లో చేసే సినిమాలు తెలుగులో అనువాదం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాను. ఒకవేళ అనువాదమైతే దానికి తగ్గ జాగ్రత్తలు కూడా తీసుకుంటాను. ఇప్పటికే ఎక్కువగా కొత్త దర్శకులతో పనిచేశాను. నన్ను నేను నిరూపించుకుంటే పెద్ద దర్శకులు కూడా నాతో సినిమాలు చేస్తారని నమ్ముతున్నాను. నేను కెరీర్ ప్రారంభంలో దర్శకత్వ శాఖలో పనిచేసినా నాకు సినిమాలను దర్శకత్వం చేయాలనే ఆలోచనేం లేదు. నేను నటించిన డీకేబోస్, డి ఫర్ దోపిడీ విడుదలకు సిద్దమవుతున్నాయి. ప్రస్తుతం రారా కృష్ణయ్య షూటింగ్‌లో ఉంది.

ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, బ్రహ్మాజీ, నాగినీడు, పృథ్వీ, తాగుబోతు రమేశ్, సప్తగిరి, కమల్, ప్రవీణ్, నిఖిల్, నర్సింగ్ యాదవ్, మీనా, సంధ్య తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, కాసర్ల శ్యామ్, కూర్పు: గౌతంరాజు, కళ: సాహి సురేశ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: మేర్లపాక గాంధీ.

English summary
Sundeep Kishan, Rakul Preet starrer Venkatadri Express is gearing up for release on November 29. Newcomer Merlapaka Gandhi has directed the film and Kiran has produced it under Anandi Art Creations banner. The film’s audio and teasers have already become a big hit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu