సందీప్ కిషన్ షార్ట్ టెంపర్, లావణ్య త్రిపాఠి కూడా
హైదరాబాద్: యంగ్ హీరో సందీప్ కిషన్ ...పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలతో ముందుకు వెల్తున్నాడు. మాస్ హీరోయిజం చూపెట్టాలని ఆశపడక, కథలతోనే ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకే అతనికి ఎప్పుడూ నిర్మాతలకు లోటు ఉండటం లేదు. తాజాగా అతను సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తో మన ముందుకు రావటానికి సన్నాహాలు చేసుకున్నాడు.
తెలుగు,తమిళ భాషల్లో నిర్మాణమయ్యే ఈ చిత్రాన్ని నిర్మాత సి.వి కుమార్ ప్రొడ్యూస్ చేస్తూ , డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ ...ఖాఖీ డ్రస్ లో అంటే పోలీస్ గ కనిపించనున్నాడు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ..."నేను ఈ సినిమాలో షార్ట్ టెంపర్ తో కూడిన , రియలిస్టిక్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాను. ఈ రోల్ చెప్పగనే చాలా ఇంట్రస్ట్ అనిపించింది. కుమార్ గారితో పనిచేయటం చాలా సంతోషంగా ఉంది. ఆయనకు మంచి విజన్ ఉంది. చాలా కాలం నుంచి మేం స్నేహితులం. మేం కలిసి పనిచేయటం చాలా సంతోషంగ ఉంది. ," అన్నారు.

సందీప్ కిషన్ గతంలో డికె బోస్ చిత్రంలో పోలీస్ అధికారిగ ాచేసారు. అయితే ఆ సినిమా రిలీజ్ కాలేదు. అసలే సెంటిమెంట్ ఉన్న ఇండస్ట్రీలో అలాంటివి పట్టింకుంటాడా అనే విషయం ప్రస్తావిస్తే... "నేను అలాంటివి పట్టించుకోను...నమ్మను..ఓ టీమ్ గ మేం మా ప్రాజెక్టుపై నమ్మకంగా ఉన్నాం. మేం త్వరలోనే షూటింగ్ స్టార్ట్ట్ చేస్తాం... ," అన్నారు.
కుమార స్వామి స్క్రీన్ ప్లే, డైలాగులు అందిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తూండగా, డానియల్ బాలాజి మరో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. గిబ్రాన్ ని సంగీత దర్శకుడుగా ఎంపిక చేసారు.


Click it and Unblock the Notifications











