»   » టైం వచ్చింది..టైటిల్ ఫిక్స్ చేసాడు

టైం వచ్చింది..టైటిల్ ఫిక్స్ చేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: తమిళంలో సూపర్‌హిట్‌ అయిన నేరం చిత్రాన్ని అనిల్‌ కృష్ణ కన్నెగంటి దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ హీరోగా తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేయమంటూ ట్విట్టర్ ద్వారా తన ఫ్యాన్స్ ను అడిగాడు సందీప్ కిషన్. వాళ్లు పంపిన కొన్ని టైటిల్స్ లోంచి ఫైనల్ గా ఓటైటిల్ ని ఓకే చేసాడు. ఆ టైటిల్ "రన్". ఈ విషయం ధృవీకరిస్తూ చేసిన ట్వీట్ చూడండి.

2013లో చాలా చిన్న సినిమాగా వచ్చితమిళం, మలయాళంలో పెద్ద హిట్ అయిన సినిమా ‘నేరం'. నేరమ్ చిత్రం తమిళ,మయాళ భాషల్లో ఇప్పటికే విడుదలై సంచలన విజయం సాధించింది. ఇదొక డార్క్ కామెడీ చిత్రం. నాగ చైతన్య చేస్తున్న రీమేక్... ఒరిజనల్ ప్రేమమ్ చిత్రం దర్శకుడు తొలి చిత్రం ఇది. ఈ చిత్రంతోనే అతనికి మంచి పేరు వచ్చింది. నజ్రియా నసీమ్, నవీన్ పోలి ఈ సినిమాలో చేసారు.

అలాగే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చిత్రం చేసి ఇప్పుడు షి అనే క్రైమ్ థ్రిల్లర్ చేస్తున్న మహత్ రాఘవేంద్ర ఈ సినిమాలో మరో కీలకమైన పాత్రను పోషించటానికి కమిటయ్యారని తెలుస్తోంది. మహత్ కు, సందీప్ కిషన్ కు ఉన్న స్నేహంతో మహత్ ఈ చిత్రం చేస్తున్నట్లు చెప్తున్నారు.

 Sundeep Kishan film titled finalised

ఇక ఈ చిత్రాన్ని ఫిక్సెల్ ఇండియా ప్రెవేట్ లిమెటెడ్ హెడ్ చెరుకూరు సుధాకర్ ఈ సినిమా ద్వారా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సినిమాని ఎ.కె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనీల సుంకర సమర్పిస్తున్నారు.


English summary
Sundeep Kishan tweeted, “& it's official..the Telugu version of Neram will be titled #Run :) March release :) Thank you all for your valuable suggestions and "Time" (like in our film) :)”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu