»   » బాణాసంచా పేలుడు: హీరో సందీప్ కిషన్‌కు గాయాలు

బాణాసంచా పేలుడు: హీరో సందీప్ కిషన్‌కు గాయాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sundeep Kishan
హైదరాబాద్: తెలుగు హీరో సందీప్ కిషన్ ఇటీవల చిన్నపాటి గాయాలతో బయట పడ్డారు. కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో చేస్తున్న ఓ సినిమా షూటింగులో పాల్గొన్న సందర్భంలో ఈ గాయాలైనట్లు తెలుస్తోంది. సినిమాలో ఓ ఫెస్టివల్ సీన్ చిత్రీకరిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఈ సీన్ చిత్రీకరణలో భాగంగా భారీ ఎత్తున్న బాణాసంచా కాల్చారు. ఈ క్రమంలో కొన్ని టపాసులు వచ్చి సందీప్ కిషన్ ఫేసుకు దగ్గరగా పేలడంతో అతనికి గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇవి చిన్నపాటి గాయాలే అని యూనిట్ సభ్యులు అంటున్నారు.

సినిమా వివరాల్లోకి వెళితే...'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమా తర్వాత సందీప్ కిషన్ ఒప్పుకున్న చిత్రం ఇదే. 'గుండెల్లో గోదారి' ఫేం కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో రూపొందుతున్నఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమా హిట్ తర్వాత సందీప్ నటించటంతో ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది.

ఇది 100% రొమాంటిక్ మూవీ అని... ప్రేక్షకుడికి కావలిసిన వినోదం మా సినిమాలో ఉంటుందని సందీప్ అంటున్నారు. ఇందులో యాక్షన్ ప్రధాన పాత్రను సందీప్ పోషిస్తున్నాడు. అలాగే, ఆయన సరసన ఇందులో ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. దీని గురించి దర్శకుడు కుమార్ నాగేంద్ర చెబుతూ, 'ఇదో యాక్షన్ డ్రామా. కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా వుంటాయి' అన్నాడు. సందీప్ సరసన రాశి ఖన్నా, సుష్మ, ప్రియాంకా బెనర్జీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

English summary
Sundeep Kishan received minor injuries on Tuesday night while shooting for his untitled film directed by Kumar Nagendra. The incident took place while shooting a festival scene on Sundeep and lead actress Rashi Khanna at a private studio in the city.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu