»   » సందీప్ కిషన్ ‘ఒక్క అమ్మాయి తప్ప’ కథ, టాక్ ఏంటి?

సందీప్ కిషన్ ‘ఒక్క అమ్మాయి తప్ప’ కథ, టాక్ ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సందీప్ కిషన్, నిత్యా మీనన్‌లు హీరో హీరోయిన్లుగా నటించిన 'ఒక్క అమ్మాయి తప్ప' సినిమా ఈరోజు ( శుక్రవారం) విడుదల అయిన విషయం తెలిసిందే. రచయిత రాజసింహ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్‌తో అందరినీ బాగా ఆకట్టుకుంది. దాంతో ఓపినింగ్స్ బాగానే వచ్చినట్లు సమాచారం.

చిత్రం కథేమిటంటే...టెర్రరిస్ట్ లు తమ బాస్ అస్లాం(రాహుల్ దేవ్) ని జైలు నుంచి విడిపించాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం అన్వర్ (రవికిషన్) ఓ ప్లాన్ చేస్తాడు. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయంలో ఓ ఫ్లై ఓవర్ పై బాంబ్ పెట్టి, గవర్నమెంట్ ని బెదిరించాలని, ఆ విధంగా తమ నాయకుడుని విడిపించుకోవాలని.


ఇక కృష్ణ(సందీప్ కిషన్) ఓ సరదాకుర్రాడు. తన చిననాటి గర్లెఫ్రెండ్ మ్యాంగో ని వెతుకుతూంటాడు. ఎప్పటిలాగే ఆ రోజు ఎటిఎమ్ నుంచి డబ్బు డ్రా చేసుకుని వస్తూంటే, నిత్యామీనన్ తో సహా చాలా మంది ఓ ట్రాఫిక్ లో ఫ్లై ఓవర్ పై ఇరుక్కుపోతారు. ఆ ట్రాఫిక్ ని అలా జామ్ చేసిందే టెర్రరిస్ట్ లు. అక్కడ నుంచి టెర్రరిస్ట్ లు ఎలా తమ ప్లాన్ ని అమలు జరపాలని చూసారు. కృష్ణ ఎలా ఆ గేమ్ లో ఇరుక్కుని ఎలా బయిటపడ్డాడు. నిత్యామీనన్ తో అతని ప్రేమ కథ ఏమైంది అనేది మిగతా కథ.


Sundeep kishan's “Okka Ammayi Thappa” Story

పూర్తిగా ట్రాఫిక్ జామ్ నేపథ్యంలోనే జరిగే ఈ సినిమాకు స్టోరీలైనే మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని ప్రమోట్ చేసారు. ఇక అనవసర అంశాలకు పెద్దగా చోటివ్వకుండా పూర్తిగా కథ మీదే శ్రద్ధ పెట్టి తెరకెక్కించామని చెప్పిన ఈ కథ...ఫస్టాఫ్ ఫరవాలేదనిపించినా సెకండాఫ్ పూర్తిగా ఫ్లై ఓవర్ పై ఇరుక్కుపోయిన ఫీలింగ్ ని తీసుకువచ్చిందని అంటున్నారు. అలాగే కామెడీ సైతం అనుకున్న స్దాయిలో పేలలేదని చెప్తున్నారు.


సందీప్ కిషన్ మాత్రం చాలా బాగా చేసాడని, కాన్సెప్టు ఓరియెంటెడ్ కథలతో విభిన్నంగా వెళ్లాలని ప్రయత్నిస్తున్న అతన్ని అభినందించాల్సిందే అని చెప్తున్నారు. కాని ఇలాంటి క్రైమ్ తో కూడిన స్క్రిప్టు మరింత టైట్ గా ఉంటే తప్ప పండటం కష్టమని చూసినవాళ్లు అంటున్నారు.


Sundeep kishan's “Okka Ammayi Thappa” Story

నిత్యామీనన్ కి, కానీ సందీప్ కిషన్ ని కానీ వీరాభిమానులకు నచ్చుతుందని, మిగతావాళ్లకు సోసోగా అనిపిస్తుందని టాక్. రచయిత రాజసింహ దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమా కోసం సందీప్ కిషన్‌తో సహా టీమ్‌లో చాలామంది రెమ్యునరేషన్ తీసుకోకుండా ఈ సినిమాకు పనిచేశారు.


తనకు ఈ సినిమాతో ఓ సాలిడ్ హిట్ రావడం ఖాయం అని సందీప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంజిరెడ్డి ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్, అనలు అరసు, చోటా కె నాయుడు లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు. మరి కాస్సేపటిలో రివ్యూ వస్తుంది.

English summary
Sundeep Kishan's latest 'Okka Ammayi Thappa' released today. Nithya Menen, who is known for choosing films with strong content, is playing the female lead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu