»   » స్టార్ డైరెక్టర్స్ తో అరడజన్ సినిమాలతో బిజీ బిజీగా సునీల్..!

స్టార్ డైరెక్టర్స్ తో అరడజన్ సినిమాలతో బిజీ బిజీగా సునీల్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మర్యాద రామన్నతో సోలో హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్న సునీల్ ఆ తర్వాత వర్మతో సినిమా చేస్తున్నాడనే సరికి అతనికి ఇంకా ఎదురేలేదనుకున్నారంతా..అయితే వర్మ చేతిలో అప్పలరాజుగా బుక్ అయిపోయిన సునీల్ ఆ తర్వాత కొద్ది కాలంగా కాళీగా ఉన్నాడు. దీంతో ఇంకా సునీల్ కి మళ్ళీ కామెడీ వేషాలే అనుకున్నారంతా.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వర్మ విషయంలో పప్పులో కాలేసినట్టు ఇంకా మిగతా సినిమాల విషయంలో అలా చెయ్యకూడదని భావించిన సునీల్ తన కెరియర్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడట. ప్రస్తుతం సునీల్ చేతిలో 'నెపోలియన్" సినిమాతో పాటు మరో అరడజను వరకూ సినిమాలున్నాయని సమాచారం. వీటిలో శ్రీనువైట్ల 'బంతి", వినాయక్ సినిమాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ అరడజను సినిమాలో ఏ ఒక్క సినిమా అయినా మర్యాద రామన్నలా క్లిక్ అయితే ఇంకా సునీల్ కి ఎదురులేదని పరిశీలకులు అంటున్నారు...

English summary
Inner sources are mentioning that Srinu Vytla for ‘Banthi’ and VV Vinayak for an action film are primary names revolving with an idea to direct sunil very soon. None knows what is the status of ‘Napoleon’ from debutant director Koti but tragically more of the new names are rolling out.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu