»   » నటుడు సునీల్‌కు తిరుమలలో అవమానం

నటుడు సునీల్‌కు తిరుమలలో అవమానం

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటుడు సునీల్ కు తిరుపతిలో అవమానం ఎదురైంది. శ్రీవారిని దర్శించుకునేందుకు మంగళవారం తిరుపతి వచ్చిన ఆయన వీఐపి దర్శనం దొరకకు ప్రయత్నించి ఇబ్బందులు పడ్డారు. అధికారుల అనుమతి కోసం రెండు మూడు గంటలు వేచి చూసినా ఏ ఒక్క అధికారి కూడా సునీల్ ను పట్టించుకున్న పాపాన పోలేదే.

పక్కరాష్ట్రం నుంచి వచ్చిన తమిళ నటుడు అర్జున్‌కు మాత్రం టీటీడీ అధికారులు వీఐపీ మర్యాదు చేశారు. సునీల్ కు ఒక్కసారి కూడా దర్శన భాగ్యం కల్పించని అధికారు.... అర్జున్ కు ఏకంగా ఆరు సార్లు దర్శన భాగ్యం కల్పించారు.

వాస్తవానికి రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు వీఐపీ దర్శనాలను రద్దు చేశారు. అయినా తమిళ నటుడు అర్జున్‌కు అవకాశం కల్పించడం.... సునీల్ ను నిర్లక్ష్యం చేయడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగోడికి తెలుగోడంటే ఇంత లోకువ ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

English summary
Actor Sunil insulted in Tirumala on Monday. TTD officer have not gave permission to Sunil.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu