»   » నవ్విస్తాడు... ('భీమవరం బుల్లోడు' ప్రివ్యూ)

నవ్విస్తాడు... ('భీమవరం బుల్లోడు' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : రకరకాల కారణాలతో వాయిదాలు పడుతూ వస్తున్న 'భీమవరం బుల్లోడు' ఈ రోజు నవ్వులతో థియోటర్స్ ముంచెత్తుతా అంటూ వచ్చేస్తున్నాడు. వరసగా సునీల్ సినిమాలు పరాజయం బాట పడుతున్న నేపధ్యంలో ఈ చిత్రంపై అందరి దృష్టీ ఉంది. దర్శకుడుగా ఉదయ్ శంకర్ కి,హీరోగా సునీల్ కి ఈ చిత్రం విజయం అత్యవసరం. అందులోనూ సురేష్ ప్రొడక్షన్ లాంటి సంస్ధ నిర్మిస్తున్న చిత్రం కావటంతో మరిన్ని అంచనాలు ఉండే అవకాసం ఉంది.

  రాంబాబు(సునీల్) ఒక ఆరోగ్య సమస్యతో రాంబాబు హాస్పిటల్‌కు వెళ్తే అతనికి బ్రెయిన్ ట్యూమర్ ఉందనీ, పది రోజుల కంటే ఎక్కువ బతకడనీ డాక్టర్లు చెబుతారు. దాంతో బతికే కొద్ది రోజులైనా ఏదైనా మంచి పని చేసి చనిపోవాలని నిర్ణయించుకుంటాడు రాంబాబు. హైదరాబాద్‌లో గూండాలు వీరవిహారం చేస్తున్నారని టీవీలో వార్తలు చూసి, ఆ గూండాలను ఏరివేద్దామని హైదరాబాద్‌కు వస్తాడు. వాళ్లతో తలపడతాడు. అక్కడ ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. ఈలోగా తనకు ఏ ఆరోగ్య సమస్యా లేదని రాంబాబుకు తెలుస్తుంది. తమతో పెట్టుకున్న వాణ్ణి రౌడీలు వదులుతారా? అతడి వెంటపడతారు. వాళ్లను అరికట్టి, తన ప్రేయసిని రాంబాబు ఎలా దక్కించుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే ఊళ్లో అమాయకంగా ఉంటే రాంబాబుకు ఏ అమ్మాయైనా నచ్చిందంటే ఆ అమ్మాయికి పెళ్లయిపోయిందన్న మాటే. దాంతో ఏ అమ్మాయికి పెళ్లి కావాలన్నా, రాంబాబు వద్దకు వచ్చి ఆమె నచ్చిందని చెప్పమని జనం బతిమాలుకుంటూ ఉంటారు. ఆఖరుకి హీరోయిన్ విషయంలో ఇదే జరుగుతుంది. ఆమె తనకు నచ్చిందని చెప్పిన వెంటనే ఆమెకు నిశ్చితార్థం జరుగుతుంది. మరి వీరిద్దరి కథ ఏమైందనేదే 'భీమవరం బుల్లోడు' .

  Sunil's 'Bhimavaram Bullodu' preview

  సునీల్ మాట్లాడుతూ...''వందశాతం నవ్వించే సినిమా 'భీమవరం బుల్లోడు'. ఆరేడు సినిమాల్లో ఎంతగా నవ్వించగలనో ఇందులో అంతకంటే ఎక్కువగా నవ్వించా. ఇందులో హీరో భీమవరం నుంచి బయల్దేరి వస్తాడు. మామూలుగా అయితే ఏ ఊర్నుంచైనా రావొచ్చు... అయితే మా సొంతూరు భీమవరం. కృష్ణగారి సొంతూరు పేరుతో తీసిన 'బుర్రిపాలెం బుల్లోడు' విజయం సాధించింది. అలా అన్ని లెక్కలు కుదరడంతో ఈ సినిమాకి 'భీమవరం బుల్లోడు' అని పేరు పెట్టాం. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ యాభయ్యేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకొన్నాక వస్తున్న తొలి చిత్రమిది. ఇందులో నేను కథానాయకుడిని కావడం గర్వంగా అనిపిస్తోంది. ఉదయ్‌శంకర్‌ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. శ్రీధర్‌ సీపాన రాసిన సంభాషణలు చిత్రానికి బలాన్నిస్తాయి''. అన్నారు.

  సురేష్ బాబు మాట్లాడుతూ...'సినిమా బాగా వచ్చింది. పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపుదిద్దుకుంది. ఆడియోలో లేని కొత్త పాటను సినిమాలో జత చేశాం' అన్నారు.
  సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తున్న ఈచిత్రాన్ని 'కలిసుందాం..రా!, ప్రేమతో..రా!, రారాజు, బలాదూర్' వంటి సినిమాలను తెరకెక్కించిన ఉదయ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 'వేయి అబద్దాలు' ఫేమ్ ఎస్తేర్ హీరోయిన్ గా నటిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతమందించారు.


  బ్యానర్:సురేశ్ ప్రొడక్షన్స్
  నటీనటులు: సునీల్, ఎస్తేర్ తనికెళ్ల భరణి, ఎస్తేర్, జయప్రకాష్‌రెడ్డి, షాయాజీ షిండే, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, అదుర్స్ రఘు, సత్యం రాజేష్, గౌతమ్‌రాజు, శ్రీనివాసరెడ్డి, తా.రమేష్, సమ్రాట్, తెలంగాణ శకుంతల, సన, శివపార్వతి, బెంగుళూరు పద్మ, విష్ణుప్రియ తదితరులు
  సంగీతం:అనూప్ రూబెన్స్,
  కథ:కవి కాళిదాస్,
  మాటలు:శ్రీధర్ శీపన,
  కెమెరా:సంతోష్‌రాయ్,
  ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత:డి.సురేష్‌బాబు,
  స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఉదయ్ శంకర్.
  విడుదల తేదీ: 27,పిభ్రవరి 2014.

  English summary
  Sunil who is testing his water with his latest outing “Bhimavaram Bullodu” is all set to release today Feb 27th. Directed by Uday Shankar of “Kalisundam Ra” fame Ester Noranha will be seen in the lead. Suresh Productions is producing this flick. Anup Rubens composed the music.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more