»   »  సునీల్...స్పీడు తో షాక్

సునీల్...స్పీడు తో షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సునీల్ హీరోగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వీరు పోట్ల దర్శకత్వంలో నూతన చిత్రం ‘ఈడు గోల్డ్ ఎహే' జనవరి 5న ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ కార్యాలయంలో లాంచనంగా ప్రారంభమైంది. అయితే మరుసటి రోజు నుంచి రెగ్యులర్ షూట్ మొదలెట్టేసారు. ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉండటంతో వీటి రిలీజ్ తర్వాత ఈ సినిమాని స్పీడ్ చేస్తారు అనుకుని అంతా భావించారు. అయితే అందుకు విరుద్దంగా సునీల్...వెంటనే రెగ్యులర్ షూట్ ప్రారంభించి అందరికీ షాక్ ఇచ్చారు. అంటే ఈ సంవత్సరం ..సునీల్ వరస సినిమాలు రిలీజ్ ఉంటాయని దీంతో అర్దమవుతోంది.

ఈరోజు నుండి రెగ్యులర్ చిత్రీకరణను జరుపుకోనున్న ఈ చిత్రాన్ని అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ ఏడాది సమ్మర్ లో గ్రాండ్ లెవల్ లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

గతంలో వీరుపోట్ల దర్శకత్వంలో ‘బిందాస్' వంటి సూపర్ హిట్ కామెడి ఎంటర్ టైనర్ ను నిర్మించిన ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తుంది. సునీల్ సరసన సుష్మా రాజ్, రిచా పనయ్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

‘పూలరంగడు', ‘మర్యాద రామన్న', ‘భీమవరం బుల్లోడు', ‘మిస్టర్ పెళ్ళికొడుకు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తి, మళ్లీ అదే స్థాయిలో నవ్వులు పూయించడానికి సిద్దం అవుతున్నాడు సునిల్.

Sunil's Eedu Gold Ehe goes to regular shoot

జయసుధ, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ, బాబ్ అంథోని, ప్రభాస్ శ్రీను, వెన్నెల కిషోర్, షకలక శంకర్, నల్ల వేణు, సుదర్శన్, భద్రమ్, గిరి తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: సాగర్ మహతి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: వివేక్ అన్నామలై, సినిమాటోగ్రఫీ: దేవరాజ్, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికపాటి, కో డైరెక్టర్: ప్రసాద్ దాసం, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: వీరుపోట్ల.

ప్రస్తుతం సునీల్ హీరో గా వంశీకృష్ణ ఆకెళ్ల ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కజిన్ మన్నారా... సునీల్ సరసన రొమాన్స్ చేస్తోంది. ప్రేమకథా చిత్రమ్ ఫేమ్ సుదర్శన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే సునీల్ హీరోగా రెడీ అయిన కృష్ణాష్టమి చిత్రం ..పిభ్రవరి 4న విడుదల కానుంది.

English summary
Sunil's upcoming entertainer ‘Eedu Gold Ehe’ directed by Veeru Potla is readying for regular shoot.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu