»   » సునీల్ కి మరో అదృష్టం-త్వరలో స్టార్స్ హీరోల లిస్ట్ లోకి ....!?

సునీల్ కి మరో అదృష్టం-త్వరలో స్టార్స్ హీరోల లిస్ట్ లోకి ....!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'అందాలరాముడు" చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన ప్రముఖ హాస్యనటుడు సునీల్‌ హీరోగా వస్తున్న తాజా చిత్రం 'మర్యాదరామన్న". సెన్సేషనల్ డైరక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 23వ తేదిన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. మొన్న ఆ మద్య రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 'కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు". లో మెయిన్ రోల్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.

కాగా ఇప్పడు టాలీవుడ్‌ టు హాలీవుడ్‌ పతాకంపై 'ప్రవరాఖ్యుడు, 'ఆ ఒక్కడు" వంటి చిత్రాలను నిర్మించిన గణేష్‌ ఇందుకూరి ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు అందులో హాస్యనటుడు సునీల్ మెయిన్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. నవ్వమైన కథా, కథనాలతో ఆగస్టు 15న ప్రారంబమవుతున్న ఈ చిత్రాన్ని శాన్వి ప్రొడక్షన్స్‌ బ్యానర్ లో ప్రొడక్షన్‌ నెం.1గా నిర్మాణం కానుంది. ఇక ఈ చిత్రానికి పనిచేసే దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలు త్వరలో తెలియజేస్తాం అని గణేష్‌ వివరించారు. మరియైతే సునీల్ ఇలాలే కంటిన్య్బూ అయితే త్వరలో సునీల్ స్టార్స్ లిస్ట్ లోనికి చేరిపోతాడంటూ ఇండస్ట్రీలో గుసగుసలాడుకొంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X