»   »  బూతు : సన్నీ లియోన్ మీద కేసు నమోదు

బూతు : సన్నీ లియోన్ మీద కేసు నమోదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ నటి సన్నీ లియోన్ మీద కేసు నమోదైంది. తన వెబ్ సైట్ ‘సన్నీలియోన్.కామ్‌'లో అభ్యంతరకరమైన బూతు మెటీరియల్ పోస్టు చేస్తోందంటూ ఆమెపై దోంబివాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందడంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.

పోలీసులు రిలీజ్ చేసిన ప్రకటన ప్రకారం...గురువారం రాత్రి ఆమెపై కేసు నమోదైంది. ఐపిసి సెక్షన్స్ 292, 292a, 294 r/w 34, ఇండియన్ రిప్రెజంటేషన్ ఆఫ్ ఉమన్ యాక్ట్, మరియు ఐటి యాక్టు సెక్షన్ 3, 4 కింద కేసు నమోదైంది. అంజలి పాలన్ అనే గృహిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు.

Sunny Leone charged with obscenity

సన్నీలియోన్ స్వయంగా ఆమె వెబ్ సైట్లో ఈ పోస్టులు చేసిందని, ఇలాంటి అభ్యంతకరమైన పోస్టులు ప్రజల మనసును కలుషితం చేస్తాయని, పిల్లలపై పెను ప్రభావాన్ని చూపుతాయని అంజలి పాలన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దోంబి వాలీ పోలీసులు ఈ కేసును సైబర్ క్రైమ్ సెల్ కు బదిలీ చేసారు.

కెనడాకు చెందిన సన్నీ లియోన్ గతంలో ఆ దేశంలో చట్టబద్దమైన అశ్లీల చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సదరు వెబ్ సైట్లో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం సన్నీ లియోన్ బాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

English summary
Bollywood actress Sunny Leone has been booked by Dombivali police here for alleged distribution of obscene content on web and social networking sites.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu