»   » నవరాత్రి థీమ్‌తో సన్నీలియోన్ కండోమ్ యాడ్.... వివాదం!

నవరాత్రి థీమ్‌తో సన్నీలియోన్ కండోమ్ యాడ్.... వివాదం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సన్నీ లియోన్ ఫోటో ఏర్పాటు చేసిన కండోమ్ యాడ్ హోర్డింగ్ వివాదాస్పదం అయింది. అసలే సన్నీ లియోన్, మాజీ పోర్న్ స్టార్.... నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నవరాత్రి థీమ్ తో గుజరాత్‌లో ఏర్పాటు చేసిన కండోమ్ యాడ్ మీద కొన్ని హిందూ సంఘాలు భగ్గుమన్నారు.

'ప్లే బట్ విత్ లవ్, దిస్ నవరాత్రి' అంటూ ఏర్పాటు చేసిన ఈ హోర్డింగ్ మీద హిందూ యువ వాహిని నిరసనకు దిగింది. ఇది కచ్చితంగా హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని ఈ గ్రూప్ నేత నరేంద్ర చౌదరి అన్నారు. ఈ హోర్డింగులను వెంటనే తొలగించకపోతే తమ నిరసనలను తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

Sunny Leone condom ad stirs controversy

ఈ యాడ్ హోర్డింగుల మీద 'ది కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్' వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కు లేఖ రాశారు. వెంటనే కలుగజేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

గతంలోనూ సన్నీ నటించిన ఈ కండోమ్ యాడ్ గోవాలోనూ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ యాడ్‌ పోస్టర్లు గోవా బస్సుల్లో ప్రదర్శించడం మహిళ సంఘాలు నిరసన వ్యక్తం చేయగా, అక్కడి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూడా ఈ యాడ్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

English summary
Sunny Leone condom ad says 'khelo magar pyaar se' this navratri, stirs controversy. The Confederation of All India Traders has accused Sunny Leone of being irresponsible and going to "any level irrespective of pious and religious occasion of Navratri" to earn money.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu