»   »  వామ్మో.. ఎన్నెన్ని మాటలనేసిందో: భారత్ మీద సన్నీ లియోస్ సంచలన కామెంట్స్!

వామ్మో.. ఎన్నెన్ని మాటలనేసిందో: భారత్ మీద సన్నీ లియోస్ సంచలన కామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: సన్నీ లియోన్.... పోర్న్ ఇండస్ట్రీ నుండి ఇండియన్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ప్రస్తుతం స్టార్ గా రాణిస్తోంది. అయితే సన్నీ లియోన్ ఇండియాలో అడుగు పెట్టిన తొలినాళ్లలో ఆమెపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే.

పోర్న్ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఆమె ఇండియన్ సినిమాల్లో ఇక్కడ కూడా పోర్న్ ఇండస్ట్రీ తయారవుతుందని, ఆమె దేశం విడిచివెళ్లి పోవాలని ఆందోళనలు జరుగాయి. కొందరైతే ఆమె దేశం విడిచి పోవాలని కేసులు కూడా పెట్టారు.

అయితే ఆ అవమానాలు, చీదరింపులు భరించి... ఇండియన్ సినీ పరిశ్రమలో నిలదొక్కుకుని బిజీ స్టార్‌గా మారిపోయింది సన్నీ లియోన్. 2016 సంవత్సరానికి సంబంధించి 'బిబిసి 100 ఉమెన్'లో సన్నీ లియోన్ కూడా చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా ఇటీవల బిబిసీ వరల్డ్ న్యూస్ తో మాట్లాడుతూ.....సన్నీ లియోన్ తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా భారత్ మీద, బాలీవుడ్ పరిశ్రమలోని పరిస్థితుల మీద సంచలన కామెంట్స్ చేసారు.

 ఐదేళ్లు పూర్తి చేసుకుంది

ఐదేళ్లు పూర్తి చేసుకుంది

సన్నీ లియోన్ ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టి ఐదేళ్లు పూర్తి చేసుకుంది. 2011లో ‘బిగ్ బాస్' రియాల్టీ షో ద్వారా ఆమె ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే తొలుత నిర్వాహకులు ఆమెను సంప్రదించినపుడు సన్నీ లియోన్ నో చెప్పిందట.

 కెరీర్లో మిస్టేక్ చేసినట్లవుతుందని

కెరీర్లో మిస్టేక్ చేసినట్లవుతుందని

బిగ్ బాస్ షోలో నటించడానికి ముందు సన్నీ లియోన్ నో చెప్పినా.... నిర్వాహకులు వదల్లేదు. షోకు సంబంధించిన వివరాలు, ఆ షోకు వస్తున్న ఆదరణ ఇలా అన్ని వివరాలు ఆమెకు వివరించారట. ఇలాంటి పెద్ద షోలో ఆఫర్ వదులుకుంటే కెరీర్లో మిస్టేక్ చేసినట్లువుతుందని ఒప్పేసుకుందట.

 తొలి నాళ్లలో భారత్ లో తనపై వచ్చిన వ్యతిరేకతపై

తొలి నాళ్లలో భారత్ లో తనపై వచ్చిన వ్యతిరేకతపై

సన్నీలియోన్‌ వల్ల భారత సంస్కృతి మంట కలిసిపోతోందంటూ... మొదట్లో ఆమెపై కొందరు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై సన్నీ లియోన్ స్పందిస్తూ ‘భారీ జనభా కలిగిన భారత్‌ అలా తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుందంటూ వివాదాస్పద కామెంట్స్ చేసింది.

 ఈ దేశంలోని వ్యక్తులకు ఆ అర్హత లేదు

ఈ దేశంలోని వ్యక్తులకు ఆ అర్హత లేదు


నా సినిమాలు చూడమని, నన్ను భరించమని నేనెప్పుడూ ఒత్తిడి చేయలేదు. నేనంటే ఆసక్తి లేకపోతే నా గురించి ఇంటర్నెట్‌లో వెతకడం ఆపెయొచ్చు అని సన్నీ లియోన్ వ్యాఖ్యానించింది. గూగుల్‌లో ఇండియన్స్‌ ఎక్కువగా తన గురించే సెర్చ్‌ చేస్తున్నారని, తన గురించి వెకిలిగా మాట్లాడే అర్హత ఈ దేశంలోని వ్యక్తులకు లేదని సన్నీ లియోన్ వ్యాఖ్యానించింది.

 మహిళల పట్ల వివక్ష

మహిళల పట్ల వివక్షబాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందని, మగాళ్లతో సమానంగా ఆడవాళ్లను చూడటం లేదని, ఆ వివక్షను భరిస్తూనే ఇక్కడి నటీమణులు కెరీర్‌ కొనసాగిస్తున్నారని సన్నీ లియోన్ కామెంట్ చేసింది.

 పోర్న్ ఇండస్ట్రీలో వివక్ష లేదు

పోర్న్ ఇండస్ట్రీలో వివక్ష లేదు

నేను పోర్న్‌ ఇండస్ట్రీలో ఉన్నపుడు ఎలాంటి వివక్షను చూడలేదని.... పోర్న్ ఇండస్ట్రీలో జాతి, మతం, లింగ బేధం గురించి పట్టించుకోరని సన్నీ లియోన్ బిబిసి ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది.

 బాలీవుడ్ కంటే పోర్న్ ఇండస్ట్రీ బెటర్

బాలీవుడ్ కంటే పోర్న్ ఇండస్ట్రీ బెటర్

ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ...... బాలీవుడ్‌లో కంటే పోర్న్‌ ఇండస్ట్రీలోనే మహిళల పట్ల మనుషుల ప్రవర్తన హుందాగా ఉంటుందని సన్నీ లియోన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

 అందుకే తీసుకుంటున్నారేమో

అందుకే తీసుకుంటున్నారేమో

మీ గతం వల్లే మీరు ఇండియన్ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని భావిస్తున్నారా? అనే ప్రశ్నకు సన్నీ లియోన్ స్పందిస్తూ.... ‘అవును, నిజమే... ఎవరైనా నాకు అవకాశం ఇవ్వడ్డానికి ముందుకు వచ్చారంటే వారి సినిమాలో సన్నీ లియోన్ షో లేదా సన్నీ లియోన్ షాట్స్ ఉండాలనే ఉద్దేశ్యంతోనే వస్తున్నారు' అని వ్యాఖ్యానించారు.

English summary
Adult film star-turned-actress Sunny Leone doesn't see "objectification" as a bad word, and says that everyone objectifies things and people to sell the product they wish to sell. In an interview with BBC World News, Sunny, who was recently named in the BBC 100 Women list 2016, talked about working in the Indian film industry and more, read a statement.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu