»   » పోర్న్ స్టార్ కంటే నటిగానే ఫ్యాన్స్ ఎక్కువ: సన్నీ లియోన్

పోర్న్ స్టార్ కంటే నటిగానే ఫ్యాన్స్ ఎక్కువ: సన్నీ లియోన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అడల్ట్ ఫిల్మ్ స్టార్ సన్నీ లియోన్ ‘జిస్మ్-2' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఆమె త్వరలో ‘ఏక్ పెహలీ లీలా' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఫిల్మిబీట్ ప్రతినిధికి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో సన్నీ లియోన్ తన మొదటి సినిమా ‘జిస్మ్-2' నుండి ‘ఏక్ పెహలీ లీలా' వరకు సాగిన తన సినీ జర్నీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. బాలీవుడ్ సినీ పరిశ్రమ తన జీవితాన్ని పూర్తిగా మార్చి వేసిందని చెప్పుకొచ్చింది.

‘జిస్మ్-2' సమయంలో నేను బాలీవుడ్ పరిశ్రమకు పూర్తిగా కొత్త. బాలీవుడ్లో నటిగా పేరు తెచ్చుకోవాలనే అబిలాష ఉంది కానీ సరైన అనుభవం లేదు. ఎంతో కష్టపడి డాన్స్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా పరిణితి సాధించాను అని సన్నీ లియోన్ చెప్పుకొచ్చింది.

Sunny Leone: Fans Now Love Me As An Actress Than A Porn Star

‘జిస్మ్-2 సినిమా నుండి ‘ఏక్ పెహలీ లీలా' వరకు చాలా చిత్రాల్లో నటించాను. అనక రకాల పాత్రలు చేసారు. అప్పటికీ ఇప్పటికీ నాలో చాలా మార్పు వచ్చింది. ‘జిస్మ్-2' సినిమా సమయంలో నేను పూర్తిగా అమెచ్యూర్. అయితే హార్డ్ వర్క్ విషయంలో మాత్రం తేడా లేదు. అప్పుడు ఎంత కష్టపడ్డానో ఇప్పుడూ అంతే కష్టపడుతున్నాను అన్నారు.

ప్రస్తుతం నేను చేస్తున్న పని ఎంతో సంతృప్తిని ఇస్తోంది. అలా అని నా గతం గురించి నేనేమీ చింతించడం లేదు. నన్ను ఇపుడు పోర్న్ స్టార్ కంటే నటిగానే ఎక్కువ మంది ఇష్ట పడుతున్నారు. ఇంత మంది అభిమానులను సంపాదించుకోవడం సంతోషంగా ఉంది అని సన్నీ వ్యాఖ్యానించింది. ఆమె నటిస్తున్న ‘ఏక్ పెహలీ లీలా' చిత్రానికి బాబీ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 10న గ్రాండ్ గా విడుదలవుతోంది.

English summary
Adult film star turned Bollywood actress Sunny Leone has become quite a known face in the industry now. Sunny Leone who is ready with her upcoming film Ek Paheli Leela has till date featured in a couple of films and also has a number of films in her kitty this year.
Please Wait while comments are loading...