»   » హైదరాబాద్ పబ్ లో సన్నిలియోన్...ఫ్యాన్స్ అప్ సెట్, గొడవ

హైదరాబాద్ పబ్ లో సన్నిలియోన్...ఫ్యాన్స్ అప్ సెట్, గొడవ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నిన్న జరిగిన ఫ్రెండ్ షిప్ డేని పురస్కరించుకుని హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లోని ఓ పబ్ వారు సన్నిలియన్ డాన్స్ పోగ్రామ్ ని ఏర్పాటు చేసారు. ఆమె లైవ్ లో డాన్స్ చేస్తుందంటే చూడటం కోసం డబ్బులు కుమ్మరించి మరీ వచ్చేసారు ఫ్యాన్స్. అయితే అంతమంది ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడటం చూసిన సన్నిలియోన్ భయపడింది. దాంతో ఆమె అక్కడ ఫెరఫార్మ్ చేయలేక వెనతిరిగింది. దాంతో కోపం తెచ్చుకున్న ఫ్యాన్స్ ఆమె తిరిగి వచ్చి డాన్స్ చేయాల్సిందే అని పబ్ నిర్వాహలను ఉద్దేశిస్తూ గొడవ చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

2012లో 'జిస్మ్‌-2' ద్వారా సన్నీ బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అనంతరం 2013లో జాక్‌పాట్‌, 2014లో రాగిణి ఎంఎంఎస్‌-2, 2015లో ఏక్‌ పెహలీ లీలా సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించారు. ప్రస్తుతం సన్నీ 'స్ల్పిట్స్‌విల్లా' అనే రియాలిటీ షో చేస్తున్నారు. సన్నీలియోని ఇప్పుడు యువతరం గుండెల్లో హాట్‌ హాట్‌ హీరోయిన్.

Sunny Leone

'రాగిణి ఎంఎంఎస్‌2', 'జిస్మ్‌2' తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలాంటి ప్రాంతీయ భాషా చిత్రాల్లోనూ అప్పుడప్పుడూ మెరుస్తోంది. ఎంతోమంది అభిమానులున్నా సన్నీ ఓ విషయంలో బాధపడుతోంది. తను గతంలో పోర్న్‌ స్టార్‌ కావడంతో ఇప్పటికీ బాలీవుడ్‌లో కొందరు చిన్నచూపు చూస్తున్నారని చెబుతోంది సన్నీ.

''నేను ఇప్పుడు బిజీ స్టార్‌నే. కానీ ఇప్పటికీ కొంత మంది హీరోలునాతో కలసి నటించడానికి వెనుకాడుతుంటారు. నాతో నటిస్తే ఎక్కడ వారి స్థాయి తగ్గుతుందో అని వారి భయం'' అని చెప్పింది సన్నీ. అలాగే...''కొన్ని నిర్మాణ సంస్థలు కూడా నాకు అవకాశాలు ఇవ్వడానికి సందేహిస్తున్నాయి. నటన పట్ల నాకు నిజంగా ఆసక్తి ఉందో లేదో అని పరీక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి'' అంటూ తను అప్పుడప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చెప్పింది సన్నీ.

English summary
Friendship Day eve turned out to be a night of huge disappointment for all the hardcore Hyderabad fans of adult star turned Bollywood diva, Sunny Leone.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu