For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మగాళ్ళలో షేప్ బాడీ ఆ హీరోదే : సన్నీలియోన్

  By Srikanya
  |

  ముంబై: తనకు తెలిసి ఉన్న మగాళ్లలో హృతిక్‌రోషన్‌ దే ఫెరఫెక్ట్ షేప్ బాడీ అంటూ సన్నిలియోన్ వ్యఖ్య చేసింది. అలాగే... 'బాలీవుడ్‌లో హృతిక్‌రోషన్‌, ప్రియాంక చోప్రాల శరీరాకృతి బాగుంటుంది' అని చెప్పుకొచ్చింది. వ్యాయామానికి సంబంధించిన తాను స్వయంగా రూపొందించిన డీవీడీని సన్నీ ఇటీవల విడుదల చేసింది.

  ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ.. 'బాలీవుడ్‌ యాక్టర్స్‌లో ప్రియాంక చోప్రా, హృతిక్‌రోషన్‌లకు పర్‌ఫెక్ట్‌ బాడీ ఉంటుంది. సినిమా రంగంలో నటీనటులు తెరపై అందంగా కనిపించడానికి ఫిట్‌నెస్సే ముఖ్య కారణం' అని వ్యాఖ్యానించింది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  శిల్పా శెట్టి, బిపాసా బసు లాంటి బాలీవుడ్ భామలు యోగా, ఫిట్ నెస్ పేరుతో డీవీడీలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సన్నీ లియోన్ కూడా ‘సన్నీ సూపర్ హాట్ మార్నింగ్స్' పేరుతో ఓ ఫిట్ నెస్ డీవీడీని లాంచ్ చేసింది. ప్రముఖ హెల్త్ గురు మిక్కీ మెహతా ఆధ్వర్యంలో సన్నీ లియోన్ వర్కౌట్స్ డీవీడీ రూపొందించారు.

  Sunny Leone: I Look at Priyanka Chopra and go 'Wow'

  ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘సూపర్ హాట్ సన్నీ మార్నింగ్స్' డీవీడీ విడుదల చేసారు. ఫిట్ నెస్ సాధించడంలో, అవగాహన పెంచుకోవడంలో ఈ డీవీడీ ఎంతగానో ఉపయోగ పడుతుందని సన్నీ లియోన్ వెల్లడించింది. ఈ డీవీడీ ప్రచారంలో భాగంగా సన్నీ సన్నీ వర్కౌట్ సాంగ్ యూట్యూబులో విడుదల చేసారు.

  కాగా... యూట్యూబులో విడుదల చేసిన ఈ సాంగ్ తెలుగు సినిమా ‘కరెంటు తీగ' చిత్రంలోని సాంగును పోలి ఉందని, సేమ్ మ్యూజిక్ ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సాంగుపై మీరూ ఓ లుక్కేయండి.

  ప్రస్తుతం సన్నీ 'మస్తీజాదే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సన్నీ ద్విపాత్రాభినయం చేసింది. తుషార్‌ కపూర్‌, వీర్‌ దాస్‌, షాద్‌ రాంధావా, సురేశ్‌ మేనన్‌, వివేక్‌ విశ్వానీలు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో రితేశ్‌ దేశ్‌ముఖ్‌ అతిధి పాత్రలో కనిపించనున్నాడు.

  'రాగిణి ఎంఎంఎస్‌2', 'జిస్మ్‌2' తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలాంటి ప్రాంతీయ భాషా చిత్రాల్లోనూ అప్పుడప్పుడూ మెరుస్తోంది. ఎంతోమంది అభిమానులున్నా సన్నీ ఓ విషయంలో బాధపడుతోంది. తను గతంలో పోర్న్‌ స్టార్‌ కావడంతో ఇప్పటికీ బాలీవుడ్‌లో కొందరు చిన్నచూపు చూస్తున్నారని చెబుతోంది సన్నీ.

  ''నేను ఇప్పుడు బిజీ స్టార్‌నే. కానీ ఇప్పటికీ కొంత మంది హీరోలునాతో కలసి నటించడానికి వెనుకాడుతుంటారు. నాతో నటిస్తే ఎక్కడ వారి స్థాయి తగ్గుతుందో అని వారి భయం'' అని చెప్పింది సన్నీ. అలాగే...''కొన్ని నిర్మాణ సంస్థలు కూడా నాకు అవకాశాలు ఇవ్వడానికి సందేహిస్తున్నాయి. నటన పట్ల నాకు నిజంగా ఆసక్తి ఉందో లేదో అని పరీక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి'' అంటూ తను అప్పుడప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చెప్పింది సన్నీ.

  English summary
  “Priyanka has a very well-shaped body. I wish I had (a) body like her,” Leone said at the launch of “Super-Hot Sunny Mornings” . Among males, Roshan has the perfect sculpted body, she said.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X