»   » సన్నీలియోన్ మరీ అంత భయస్తు రాలా?? .... నెలరోజులు పట్టిందట

సన్నీలియోన్ మరీ అంత భయస్తు రాలా?? .... నెలరోజులు పట్టిందట

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పటి వరకు స్కిన్ షోకే పరిమితమైన సన్నీ లియోన్ ఇప్పుడు ఇంకో కొత్త అవతారం లోకి మారింది. అదెంటంటారా.... మైక్ పట్టుకోని రాగాలు తీస్తుందట ఈ హాట్ హాట్ భామ. నటించటం ఒకటే కాదు తనకొచ్చిన విధ్యలన్నీ ఒక్కొక్కటే ప్రదర్శిస్తోంది. అలా ఇప్పుడు సింగర్ గా మారింది సన్నీ లియోన్.

మైక్ ముందు బుద్ధిగా నించుని తాను పాట పాడుతున్న ఫొటోను ట్విటర్ లో పెట్టింది. "మైక్ ముందు గట్టిగా పాట పాడడానికి చాలా భయపడ్డానని, నెల రోజుల పాటు రిహార్సిల్ చేశానని ". చెబుతూ తన పాట అందరికీ నచ్చుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అయితే ఈ పాట సినిమా కోసమా?? లేక ఏదైనా ఆల్బం కోసమా అన్న విషయం మాత్రం చెప్పలేదు.

'వన్ నైట్' సినిమాలో చివరిసారిగా కనిపించిన సన్నీ లియోన్ ప్రస్తుతం యూత్ రియాలిటీ షో 'ఎంటీవీ స్ల్పిట్స్ విల్లా సీజన్ ౯'కు హోస్ట్ గా చేస్తోంది. షారూఖ్ ఖాన్ తాజా చిత్రం 'రాయిస్' సినిమాలో ఐటెం పాట కోసం సన్నీ లియోన్ ను సంప్రదించినట్టు సమాచారం. 1980 దశకంలో హిట్టైన 'ఖుర్బానీ' సినిమాలోని లైలా ఓ లైలా' రీమిక్స్ పాటలో సన్నీ లియోన్ ను నటింపజేయాలని చూస్తున్నారు. ఈ సాంగ్ ఒరిజినల్ వెర్షన్ లో ఫిరోజ్ ఖాన్, జీనత్ అమన్ నటించారు.

English summary
Sunny on Monday shared a photograph of herself in a music studio, where she is seen standing in front of a mic.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu