»   » వర్మకు సన్నిలియోన్ షాక్.. పబ్లిక్ టాయిలెట్ కంటే హీనంగా వాడుతున్నారు.. బుద్ది చెప్పండి..

వర్మకు సన్నిలియోన్ షాక్.. పబ్లిక్ టాయిలెట్ కంటే హీనంగా వాడుతున్నారు.. బుద్ది చెప్పండి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సెక్స్ బాంబ్ సన్నిలియోన్‌కి సోషల్ మీడియాలో కూడా వేధింపులు తప్పడం లేదట. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వెబ్‌సైట్లలో తీవ్ర అభ్యంతరకరమైన పోస్టులతో వేధిస్తున్నారట. అలా పచ్చిగా పోస్టులు పెట్టి ఇబ్బంది పెట్టే వాళ్ల చేతులను ఎలా కట్టేయాలో.. వారికి ఎలా బుద్ధి చెప్పాలో తనకు తెలుసునంటూ ఇటీవల సన్నిలియోన్‌ స్పందించింది.

వర్మకు కౌంటర్

వర్మకు కౌంటర్

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల మహిళా దినోత్సవం రోజున సన్నిలియోన్‌ని ఉద్దేశించి కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంలోని మహిళలందరూ సన్నిలియోన్ మాదిరిగా మగవాళ్లకు సంతోషాన్ని పంచాలి అని అంటూ ట్వీట్ చేయడం వివాదాస్పదమైంది. వర్మ ట్వీట్స్ సన్ని ధీటుగా సమాధానమిచ్చిన సంగతి తెలిసిందే..

 సోషల్ మీడియాలో వేధిస్తున్నారు.

సోషల్ మీడియాలో వేధిస్తున్నారు.

రాంగోపాల్ వర్మ మాదిరిగానే కొందరు చెత్త కామెంట్లు, ట్వీట్స్, పోస్టులతో విసిగిస్తున్నారు. వారికి సోషల్ మీడియాను సరైన రీతిలో ఉపయోగించుకోవడం తెలీదు. చెడు పనులకు కొందరు దానిని వేదిక చేసుకొంటున్నారు. అలాంటి వారికి తగిన బుద్ది చెప్పాలంటే వారిని సోషల్ మీడియా అకౌంట్లలో బ్లాక్ చేసి వారి నోరు మూయించండి అంటూ మహిళలకు సన్నీ సలహాలను ఇచ్చింది.

పరోక్షంగా వర్మపై సెటైర్

పరోక్షంగా వర్మపై సెటైర్

సోషల్ మీడియా పవర్ ఎంటో కొంతమందికి తెలియదు. చాలా మంది సోషల్ మీడియాను పబ్లిక్ టాయిలెట్‌ కంటే హీనంగా వాడుతున్నారు. వారు అలా పబ్లిక్ టాయిలెట్ లాగా వాడటం నాకు ఇష్టం ఉండదు. మనం సోషల్ మీడియాను వివిధ రకాల ప్రయోజనాల కోసం వినియోగిస్తాం. నేను మాత్రం సోషల్ మీడియాను సానుకూల ప్రయోజనాలకు మాత్రమే వాడుతుంటాను అని సన్నిలియోన్ పేర్కొన్నది.

సోషల్ మీడియా పవర్ ఫుల్

సోషల్ మీడియా పవర్ ఫుల్

సోషల్ మీడియా అనేది చాలా పవర్ ఫుల్. దానిని సక్రమంగా వినియోగించుకొంటే బాగుంటుంది. పనికి రాని పనులకు ఉపయోగించి దాని విలువ తీయకండి. కొందరి తీరు వల్ల సోషల్ మీడియాపై చెడు ప్రభావం పడుతుంది అని సన్నిలియోన్ వెల్లడించింది.

English summary
Actor Sunny Leone says that she has learnt to use social media in a positive way. She also refrains from reacting when anyone takes a jibe at her, as filmmaker Ram Gopal Varma recently did.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu