»   » ప్రెగ్నెన్సీపై సన్నీ లియోన్ ఏమందంటే...?

ప్రెగ్నెన్సీపై సన్నీ లియోన్ ఏమందంటే...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా సన్నీ లియోన్ గురించి ఓ ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది. ఓ న్యూస్ ఏజెన్సీ వారు సన్నీ లియోన్ గర్భవతి అనే వార్తలను ఏప్రిల్ ఫూల్ న్యూస్‌గా స్ప్రెడ్ చేసారు. అయితే సన్నీ లియోన్ వెంటనే ఈ వార్తలను తన ట్విట్టర్ ద్వారా కొట్టి పారేసింది.

ఓ వైపు తను నటించిన ‘ఏక్ పహెలీ లీలా' చిత్రం విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఇలాంటి వార్త ప్రచారంలోకి రావడంపై సన్నీ లియోన్ కాస్త షాకైంది. మరో వైపు ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో ఇతర మీడియా సంస్థల ప్రతినిధులు ఆమెను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించాయి.

Sunny Leone opens about pregnancy

దీనిపై సన్నీ లియోన్ స్పందిస్తూ....నేను గర్భం దాల్చడానికి ఇది సరైన సమయం కాదని నా భావన అని స్పష్టం చేసింది. భవిష్యత్తులో గర్భం దాల్చేఆలోచన ఏమైనా ఉందా? అని అడగ్గా....‘నేను నా ఫ్యామిలీ గురంచి ఆలోచించడం లేదని చెబితే అబద్దం చెప్పినట్లే అవుతుంది. ఫిజికల్ గా చూసుకుంటే ఇది సరైన సమయం కాదని నా భావన. నాకు పిల్లలను కనాలని ఉంది. అయితే ఇపుడు మాత్రం కాదు. ఇంకా సమయం ఉంది' అని సమాధానం ఇచ్చింది.

‘ఏక్ పహెలీ లీలా' సినిమా విషయానికొస్తే...ఈ చిత్రంలో సన్నీ లియోన్ గత చిత్రాలకు భిన్నంగా కనిపించబోతోంది. తొలిసారిగా ఆమె ఇందులో త్రిపాత్రాభినయం చేస్తోంది. ప్రేమ కథ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథకు రివేంజ్ అంశాన్ని జోడించారు. 300 సంవత్సరాల కిందట జరిగిన కథతో ఈ సినిమా సాగుతుంది. ‘లీలా' చిత్రానికి బాబీ ఖాన్ దర్శకత్వం వహించారు. సన్నీ లియోన్ హాట్ అండ్ సెక్సీ అవతార్ ఆకట్టుకోనుంది. ఏప్రిల్ 10న సినిమా విడుదల కాబోతోంది.

English summary
Sunny Leone who is waiting for release of her upcoming film Leela says it's not the right time for her to get pregnant as of now. Asked if she is planning to experience motherhood in near future the Indo-Canadian adult star told: "I would be lying if I say I don't think about my family, but now physically for me, this is not the time to get pregnant.I want to have kids, but for now I don't want to let one year go for my body (sic)."
Please Wait while comments are loading...