Just In
- 1 min ago
‘సర్కారు వారి పాట’ నుంచి స్పెషల్ వీడియో: మహేశ్ మూవీపై కీర్తీ సురేష్ పోస్ట్
- 45 min ago
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- 1 hr ago
భర్త చేసిన పనికి అప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక.. ఏకంగా వీడియో రిలీజ్ చేసి..
- 1 hr ago
మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది
Don't Miss!
- Sports
పుజారా.. బ్యాటింగ్ చేస్తుంటే నీకు బోర్ కొట్టదా?! వెలుగులోకి మరో ఆసీస్ ప్లేయర్ స్లెడ్జింగ్!
- Automobiles
డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సినిమాగా ఆమె జీవిత చరిత్ర, బోల్డన్ని సెక్స్ సీన్స్, వివాదాలు
ముంబయి: ఇప్పుడు బాలీవుడ్ లో బయోపిక్ లో సీజన్ నడుస్తోంది. ప్రతీ దర్శకుడు, నిర్మాత తెల్లారి లేచి ఎవరి బయోపిక్ అయితే జనాలను ఆకట్టుకుంటుంది. ఆ బయోపిక్ లో ఎవరు నటిస్తారు వంటి విషయాలు డిస్కస్ చేయటం, స్క్రిప్టులు రెడీ చేసుకుని పట్టాలు ఎక్కించే పనిలో పడుతున్నాయి.
అలాగే తాజాగా జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి సన్నీలియోన్ జీవిత చరిత్ర కూడా తెరకెక్కించటానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. అమెరికాలో అడల్ట్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె, ఇండియా వచ్చి బిగ్ బాస్ అనే రియాల్టి షోలో పాల్గొని, తర్వాత ఇక్కడే ఉండి బాలీవుడ్ ఆఫర్స్ పట్టుకుని ఎదగటం అనేది మామూలు విషయం కాదు.
ఖచ్చితంగా అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమా అవుతుంది కాబట్టి డిమాండ్ ఉంటుందని బావిస్తున్నారు. దానికి తోడు రీసెంట్ గా సల్మాన్,షారూఖ్ , ప్రధాని నరేంద్ర మేడీలను కూడా దాటేసి గూగుల్ లో నెంబర్ వన్ సెలబ్రెటీగా నిలబడింది. అంటే ఆమె మీద జనాలకు ఎంత ఆసక్తి ఉందో అర్దం చేసుకోవచ్చు.
వాస్తవానికి సన్నిలియోన్ నటించిన సినిమాలు దాదాపు బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేకపోయాయనే చెప్పుకోవాలి. అయినా సన్నీకి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఆమె జీవితం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కబోతోందనే వార్త బాలీవుడ్ మీడియాను షేక్ చేస్తోంది.
స్లైడ్ షోలో ఎవరు డైరక్ట్ చేస్తున్నారు. ఏయే అంశాలు ఉంటాయనే విషయాలు..

ఇక
సన్నీ లైఫ్‌స్టోరీ ఆధారంగా ఇది వరకే ఓ లఘుచిత్రం విడుదలైంది. ఇప్పుడు బయోపిక్ తెరకెక్కించనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.

ఇంకో విశేషమేమిటంటే..
సినిమాలో సన్నీ పాత్రలో ఆమే స్వయంగా నటించడం మరో విశేషం.

విభిన్నంగా..
సన్నీపై వచ్చిన లఘుచిత్రం కంటే ఈ బయోపిక్ చాలా భిన్నంగా ఉంటుందని చెప్తున్నారు.

వీళ్లంతా..
ఇందులో సన్నీ భర్త డేనియల్ వెబర్, అతని స్నేహితులు కూడా నటించనున్నట్లు తెలుస్తోంది.

శృతి మించదు
అయితే శ్రుతి మించిన శృంగారం ఉండబోదని చెప్తున్నారు.

అంటారు కానీ
ఖచ్చితంగా సన్నిలియోన్ అడల్ట్ స్టార్ గా ఉన్నప్పుడు సీన్స్ చూపించాలంటే సెన్స్ సీన్స్ పెట్టడం తప్పనిసరి అంటున్నారు.

డాక్యుమెంటరిలా కాదు
ఈ సినిమా ఖచ్చితంగా డాక్యుమెంటరిలాగ ఉండదని, చాలా రియల్ గా , ఎమోషనల్ డ్రామా అి చెప్తున్నారు.

ఫన్, ఎమోషన్
ఈ బయోపిక్ లో రెగ్యులర్ నిజ జీవితంలో ఉండే ఫన్, ఎమోషన్ మిక్స్ అయ్యి ఉంటుందని చెప్తున్నారు.

మసాలా ఎంటర్టైనర్
ఒక విధంగా చెప్పాలంటే ఇదో మసాలా ఎంటర్టైనర్ అని చెప్తున్నారు.

అబద్దాలు ఉండవు
చాలా మంది బయోపిక్ లలో చాలావరకూ అవాస్తవాలు చోటు చేసుకుంటాయి కానీ ఈ బయోపిక్ లో మాత్రం అబద్దాలు అనేవి మాత్రం ఉండవని చెప్తున్నారు.

వివాహం
డానియల్ తో ప్రేమలో పడటం, అతన్ని వివాహం చేసుకోవటానికి దారి తీసిన సంఘటనలకు ప్రయారిటీ ఉండబోతోంది.

షూటింగ్ ఎక్సపీరియన్సెస్
బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆమెకు ఎదురైన చేదు అనుభవాలు సైతం ఈ బయోపిక్ లో చూపనున్నారు.

ప్రారంభం
ఈ సినిమాని ఈ సంవత్సరం చివరి నెలల్లో అంటే నవంబర్, డిసెంబర్ లలో లాంచ్ చేస్తామని చెప్తున్నారు.

పారినర్స్
ఈ సినిమాలో కేవలం బాలీవుడ్ నటులు మాత్రమే కాకుండా ఫారినర్స్ కు కూడా చోటు ఉందని చెప్తున్నారు

డైరక్టర్ ఎవరూ అంటే
ఈ సినిమాని తేరేబిన్ లాడెన్ డైరక్టర్ అభిషేక్ వర్మ డైరక్ట్ చేయనున్నారు.

అవమానించబడిన
ఈ సినిమాలో గతంలో నేషనల్ న్యూస్ ఛానెల్ లో ఓ పేరొందిన జర్నలిస్ట్ చేత అవమానించబడటం కూడా ఉండబోతోందని తెలుస్తోంది.

అభిప్రాయం మారటానికే
తన మీద బాలీవుడ్ కు ఓ చీప్ అభిప్రాయం ఉందని , దాన్ని మార్చటానికి ఈ బయోపిక్ ఉపయోగపడుతుందని భావిస్తోంది సన్ని.

దీపామెహతా
గతంలో సన్నిలియోన్ మీద డాక్యుమెంటరీని ప్రముఖ దర్శకురాలు దీపామెహతా చేసారు.

ఇది రెండోసారి
ఇప్పటివరకు సెలబ్రిటీలపై తీసిన బయోపిక్‌లో వారంతట వారే నటించడం ఇది రెండోసారి. క్రికెట్ లెజెండ్ సచిన్ తెందుల్కర్ జీవితం ఆధారంగా వస్తున్న సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్ చిత్రంలో ఆయనే నటిస్తున్న సంగతి తెలిసిందే.

బిజినెస్
డర్టీపిక్చర్ తరహాలో సన్నిలియోన్ జీవిత చరిత్ర కూడా అందరినీ అలరిస్తుందని , ఖచ్చితంగా ఈ బయోపిక్ అందరినీ అలరిస్తుందని భావిస్తున్నారు.