మరో సౌత్ మూవీకి కమిటైన సన్నీ లియోన్, తెలుగులో కూడా..!
మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళుతోంది. బాలీవుడ్లో పలు హిట్ చిత్రాల్లో నటించిన సన్నీ లియోన్ సౌత్ సినిమా పరిశ్రమ నుండి కూడా అవకాశాలు రావడంతో వాటిని అందిపుచ్చుకుంటూ తన పాపులారిటీని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో 'వీర మహాదేవి' అనే చిత్రం చేస్తున్న సన్నీ దీని తర్వాత మరో సౌత్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ చిత్రాన్ని తెలుగు ప్రొడ్యూసర్ మల్కాపురం శివ కుమార్ నిర్మించబోతున్నారు. కన్నడ డైరెక్టర్ రఘురాజ్ దర్శకత్వం వహించబోతున్నారు. దీన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ ఓ రివేంజ్ డ్రామాగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సన్నీ లియోన్ చేస్తున్న 'వీర మహాదేవి' షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

వీర మహాదేవి సినిమా విషయానికొస్తే... పీరియడ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సన్నీ లియోన్ వారియర్ క్వీన్ గా కనిపించబోతున్నారు. విసి వడివుదయన్ దర్శకత్వం వహిస్తుండగా దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్ తో పోన్సె స్టీఫెన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం బడ్జెట్లో ఎక్కువ శాతం కంప్యూటర్ గ్రాఫిక్స్ కోసమే వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం సన్నీ లియోన్ కత్తి యుద్ధం, గుర్రపుస్వారీలో శిక్షణ పొందారు. ఈ చిత్రంలో నవదీప్ విలన్ పాత్రలో నటిస్తుండగా అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











