»   » రాత్రికి నీ రేటు ఎంత? చెంప చెల్లుమనిపించిన సన్నీ లియోన్!

రాత్రికి నీ రేటు ఎంత? చెంప చెల్లుమనిపించిన సన్నీ లియోన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూరత్: గుజరాత్ లో హోలీ సంబరాల్లో పాల్గొనడానికి వచ్చిన సన్నీ లియోన్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఈ క్రమంలో చిర్రెత్తిపోయిన ఆమె కోపాన్ని అణచుకోలేక జర్నలిస్టు చెంపచెల్లు మనిపించింది. ఓ నేషనల్ ఛానల్‌కు చెందిన రిపోర్టర్ అతిగా ప్రవర్తించి సన్నీ చేతిలో చెంపదెబ్బతిన్నాడు.

కామకేళి? సన్నీ లియోన్ నుండి 'లస్ట్' వాసన!

గుజరాత్ లోని సూరత్‌లో హోలీ సందర్భంగా గురువారం 'సన్నీ లియోన్ తో హోలీ' అనే ఈవెంటు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ ఛానల్ కు చెందిన రిపోర్టర్ ఆమెను ఇంటర్వ్యూ చేసాడు. ఇపుడు హీరోయిన్ అయిపోయారు కదా... మరి రాత్రి కార్యక్రమాలకు ఎంత తీసుకుంటున్నారు? అంటూ సదరు రిపోర్టర్ ద్వంద్వ అర్థం వచ్చేలా ప్రశ్నించారు. దీంతో సన్నీ లియోన్ కోపంతో అతని చెంపచెల్లుమనిపించింది.

Sunny Leone

ఈ సంఘటనతో అక్కడ రసాబస మొదలైంది. తర్వాత సన్నీ లియోన్ నిర్వహకులతో గొడవపడింది. రిపోర్టర్లు లేకుంటేనే తాను ఈ షో చేస్తానని మెలిక పెట్టింది. దీంతో రిపోర్టర్లందరినీ నిర్వాహకులు బయటకు పంపారు. దీంతో కూల్ అయిన సన్నీ లియోన్ హోలీ ఈవెంటులో తన ఆటపాటలతో అలరించింది.

ప్రస్తుతం సన్నీ లియోన్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె మూడు చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. జాస్మిన్ మోసెస్ డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా 'వన్ నైట్ స్టాండ్' షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. దీంతో పాటు రాజీవ్ చౌదరి దర్శకత్వంలో 'బీమాన్ లవ్', దేవాంగ్ ధోలకియా దర్శకత్వంలో 'టినా అండ్ లోలో' చిత్రం చేస్తోంది. షారుక్ ఖాన్ మూవీ 'రియాస్' లో ఐటం సాంగుతో అభిమానులను అలరించబోతోంది.

English summary
Sunny Leone slaps journalist for asking how much she charges for night programmes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu