»   »  సన్నీ లియోన్ డ్రీమ్ రోల్ అదే...

సన్నీ లియోన్ డ్రీమ్ రోల్ అదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌: ప్రతీ ఆర్టిస్టుకు తమకంటూ కొన్ని డ్రీమ్ రోల్స్ ఉంటాయి. అలాగే సన్నిలియోన్ కు కూడా ఉన్నాయి. ఆమె ఈ విషయమై ట్విట్టర్ లో తన అభిమానులకు ఇచ్చిన సమాధానం ద్వారా తన డ్రీమ్ రోల్ ని తెలియచేసారు. ఆ ట్వీట్ ని మీరు ఇక్కడ చూడండి

సూపర్‌ ఉమెన్‌ పాత్ర పోషించడమే తన లక్ష్యమని ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ సన్నీలియోని పేర్కొన్నారు. ట్విట్టర్‌లో తన అభిమానొకరు 'కెరీర్‌లో సూపర్‌ ఉమెన్‌ భూమిక పోషించడమే మీ లక్ష్యమా' అని అడిగారు. అందుకు స్పందించిన సన్నీ అవును సూపర్‌హీరో పాత్ర పోషించాలని ఉందని సమాధానమిచ్చారు.

2012లో 'జిస్మ్‌-2' ద్వారా సన్నీ బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అనంతరం 2013లో జాక్‌పాట్‌, 2014లో రాగిణి ఎంఎంఎస్‌-2, 2015లో ఏక్‌ పెహలీ లీలా సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించారు. ప్రస్తుతం సన్నీ 'స్ల్పిట్స్‌విల్లా' అనే రియాలిటీ షో చేస్తున్నారు.

Sunny leone wants to act as Super Hero

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సన్నీలియోని ఇప్పుడు యువతరం గుండెల్లో హాట్‌ హాట్‌ హీరోయిన్. 'రాగిణి ఎంఎంఎస్‌2', 'జిస్మ్‌2' తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలాంటి ప్రాంతీయ భాషా చిత్రాల్లోనూ అప్పుడప్పుడూ మెరుస్తోంది.

ఎంతోమంది అభిమానులున్నా సన్నీ ఓ విషయంలో బాధపడుతోంది. తను గతంలో పోర్న్‌ స్టార్‌ కావడంతో ఇప్పటికీ బాలీవుడ్‌లో కొందరు చిన్నచూపు చూస్తున్నారని చెబుతోంది సన్నీ.

''నేను ఇప్పుడు బిజీ స్టార్‌నే. కానీ ఇప్పటికీ కొంత మంది హీరోలునాతో కలసి నటించడానికి వెనుకాడుతుంటారు. నాతో నటిస్తే ఎక్కడ వారి స్థాయి తగ్గుతుందో అని వారి భయం'' అని చెప్పింది సన్నీ.

అలాగే...''కొన్ని నిర్మాణ సంస్థలు కూడా నాకు అవకాశాలు ఇవ్వడానికి సందేహిస్తున్నాయి. నటన పట్ల నాకు నిజంగా ఆసక్తి ఉందో లేదో అని పరీక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి'' అంటూ తను అప్పుడప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చెప్పింది సన్నీ.

English summary
Sunny leone tweeted that she want to act as Super Hero.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu