»   » సన్నీ లియోన్ తన పేరెంట్స్‌కు తెలియకుండా అప్పట్లో.....

సన్నీ లియోన్ తన పేరెంట్స్‌కు తెలియకుండా అప్పట్లో.....

Posted By:
Subscribe to Filmibeat Telugu

సన్నీ లియోన్ గురించి మనకు తెలిసింది చాలా తక్కువే. చాలా మందికి ఆమె గతంలో ఓ పోర్న్ స్టార్ అని, ఆ తర్వాత హిందీ 'బిగ్ బాస్' షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిందని, అలా భారతీయ సినీ రంగంలో ఎంటరైందని మాత్రమే తెలుసు.

సన్నీ లియోన్‌ గురించి బయటి ప్రపంచానికి తెలియని చాలా విషయాలు 'మోస్ట్లీ సన్నీ' అనే డాక్యుమెంటరీ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ డాక్యుమెంటరీకి దిలీప్ మెహతా దర్శకత్వం వహించారు. ఇప్పటికీ దీన్ని మామి, టిఐఎఫ్ఎఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు.

ఇందులో సన్నీ గురించి పలు ఆసక్తికర విషయాలు చూపించారు. ఒకప్పుడు సన్నీ లియోన్ పబ్లిక్ వెడ్డింగ్స్ లో డాన్సులు చేసేదట. తాను చేసిన క్రేజియొస్ట్ థింక్స్ లో ఇది కూడా ఒకటి సన్నీ లియోన్ తెలిపారు.

పోర్న్ స్టార్ అవుతానని చెప్పగానే ఇంట్లో...

పోర్న్ స్టార్ అవుతానని చెప్పగానే ఇంట్లో...

తాను పోర్న్ స్టార్ అవుతానని చెప్పగానే సన్నీ లియోన్ పేరెంట్స్ నుండి వ్యతిరేకత ఎదురైందట. అప్పటి నుండి వారితో సంబంధాలు సరిగా ఉండేవికాదట.

తల్లిదండ్రులకు తెలియకుండా

తల్లిదండ్రులకు తెలియకుండా

తల్లిదండ్రులిద్దరూ బ్రతికి ఉన్న సమయంలోనే వారికి తెలియకుండా తొలిసారిగా ‘పెంట్ హౌస్' మేగజైన్ కోసం నగ్నంగా ఫోజులు ఇచ్చానని సన్నీ లియోన్ తెలిపింది. అపుడు ఈ విషయం ఇంట్లో తెలియకుండా ఉండేందుకు తన ఇంటి సమీపంలో ఉన్న లోకల్ స్టోర్స్ అన్నింటిలో ‘పెంట్ హౌస్' మేగజైన్ లేకుండా చేసిందట. అన్నీ తానే కొనేసిందట.

సన్నీ పేరు ఎలా వచ్చిందంటే...

సన్నీ పేరు ఎలా వచ్చిందంటే...

సన్నీ లియోన్ అసలు పేరు కరెన్జీత్ కౌర్ వోహ్రా. పోర్న్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే ఆమె తన పేరును సన్నీగా మార్చుకుంది. పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినపుడు స్టేజ్ నేమ్ ఏమి ఇవ్వాలో అర్థం కాలేదట. ఇంట్లో అపుడు సోదరుడు సందీప్ ను అంతా ‘సన్నీ' అని ముద్దు పేరుతో పిలిచేవారు. ఆ సమయంలో ఆమెకు అదే పేరు గుర్తు రావడంతో పోర్న్ ఇండస్ట్రీలో తన పేరును ‘సన్నీ'గా నమోదు చేసుకుంది.

ఇంట్లో తెలిసిన తర్వాత

ఇంట్లో తెలిసిన తర్వాత

పెంట్‌హౌస్ మేగజైన్ కోసం నగ్నంగా ఫోజులు ఇచ్చిన విషయం ఇంట్లో పేరెంట్స్ కు తెలిసిన తర్వాత..... మా అమ్మ చాలా సైలెంట్ అయిపోయింది. ఒకటే విషయం అడిగింది. ‘నగ్నంగా ఇదంతా చేశావా? అని మాత్రమే అడిగింది. మా నాన్న ‘ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు మమ్మల్ని ఎందుకు సంప్రదించలేదు? నేను ఒకటి మాత్రమే చెప్పగలను నీకు జీవితంలో ఏది ఉత్తమం అనిపిస్తే అదే చేయి' అని అన్నారని సన్నీ లియోన్ ఈ డాక్యుమెంటరీలో వెల్లడించారు.

భారత్‌కు చెందిన వారే

భారత్‌కు చెందిన వారే

సన్నీ లియోన్‌ కెనడా...ఒంటారియాలో సిక్ పంజాబీ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి టిబెట్‌లో పుట్టి ఢిల్లీలో పెరిగాడు. ఆమె తల్లి హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వ్యక్తి.

English summary
Sunny was not on good terms with her parents after they got to know about her being a porn star is known to all.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu