»   » మీ భర్తలు నాకు అవసరం లేదు. నాకూ భర్త ఉన్నాడు

మీ భర్తలు నాకు అవసరం లేదు. నాకూ భర్త ఉన్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: .''తమ భర్తలు నాతో నటించకూడదని కొంతమంది హీరోల భార్యలు కోరుకుంటున్నారు. వారి భర్తలను వలలో వేసుకుంటానని వారి అనుమానమేమో..'' అని చెప్పింది.''మీ భర్తలు నాకు అవసరం లేదు. నాకూ భర్త ఉన్నాడు'' అని ఒకింత వ్యంగ్యంగానే చెప్పింది సన్నీ లియోన్. హీరోల భార్యల తీరుపైనా ఆవేదన వ్యక్తం చేసింది. 'పూర్తిస్థాయి నటిగా మిమ్మల్ని పరిశ్రమ అంగీకరించిందా?' అన్న ప్రశ్నకు..ఆమె ఇలా సమాధానమిచ్చింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సన్నీలియోని ఇప్పుడు యువతరం గుండెల్లో హాట్‌ హాట్‌ హీరోయిన్. 'రాగిణి ఎంఎంఎస్‌2', 'జిస్మ్‌2' తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలాంటి ప్రాంతీయ భాషా చిత్రాల్లోనూ అప్పుడప్పుడూ మెరుస్తోంది.

ఎంతోమంది అభిమానులున్నా సన్నీ ఓ విషయంలో బాధపడుతోంది. తను గతంలో పోర్న్‌ స్టార్‌ కావడంతో ఇప్పటికీ బాలీవుడ్‌లో కొందరు చిన్నచూపు చూస్తున్నారని చెబుతోంది సన్నీ.

''నేను ఇప్పుడు బిజీ స్టార్‌నే. కానీ ఇప్పటికీ కొంత మంది హీరోలునాతో కలసి నటించడానికి వెనుకాడుతుంటారు. నాతో నటిస్తే ఎక్కడ వారి స్థాయి తగ్గుతుందో అని వారి భయం'' అని చెప్పింది సన్నీ.

Sunny Leone: Women, I don't want your husbands

అలాగే...''కొన్ని నిర్మాణ సంస్థలు కూడా నాకు అవకాశాలు ఇవ్వడానికి సందేహిస్తున్నాయి. నటన పట్ల నాకు నిజంగా ఆసక్తి ఉందో లేదో అని పరీక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి'' అంటూ తను అప్పుడప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చెప్పింది సన్నీ.

ఆమె తాజా చిత్రం విషయానికి వస్తే..

సన్నీ లియోన్ త్వరలో ‘లీలా' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన పాట విడుదలైంది. మూడు నిమిషాల నిడివి గల ఈ పాట సినిమాపై ఒక్కసాగి అంచనాలు అమాంతం పెంచేసింది. ఈ చిత్రంలో సన్నీ లియోన్ గత చిత్రాలకు భిన్నంగా కనిపించబోతోంది. తొలిసారిగా ఆమె ఇందులో త్రిపాత్రాభినయం చేస్తోంది. ఈ పాట లో సన్నీ లియోన్ హాట్ అండ్ సెక్సీ అవతారం ఆకట్టుకుంటోది.

ప్రేమ కథ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథకు రివేంజ్ అంశాన్ని జోడించారు. 300 సంవత్సరాల కిందట జరిగిన కథతో ఈ సినిమా సాగుతుంది. ట్రైలర్ చూస్తేంటే సన్నీ లియోన్‌ను ఆరాధించే శృంగార ప్రియులను నిరాశ పరచకుండా సినిమా ఉంటుందని స్పష్టమవుతోంది.

ఇటీవలే ఓ క్లాసికల్ డ్యాన్స్ నంబర్ కూడా చిత్రీకరించారు. ఈ పాట కోసం చాలా శ్రమించిది. సరోజ్ ఖాన్ వద్ద కొన్నాళ్లపాటు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. క్లాసికల్ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ నృత్యంలో శిక్షణ తీసుకోవాలని చాలా సార్లు అనుకున్నాను. కానీ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల అందుకు వీలుపడలేదు. లీలా చిత్రంతో ఈ కోరిక తీరిందని చెప్పుకొచ్చింద సన్నీ.

బాబీ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. భూషణ్ కుమార్, అహ్మద్, షైరా ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదైలంది. ప్రిన్సెస్ లుక్‌లో సన్నీ లియోన్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఈ చిత్రంలో మొత్తం 9 పాటలు ప్లాన్ చేసారు. తన గత సినిమాలతో పోలిస్తే ఈచిత్రంలో సన్నీ లియోన్ పూర్తిగా డిఫరెంట్‌గా కనిపించబోతోంది.డిఫరెంటుగా ఉన్నప్పటికీ...సన్నీ లియోన్‌ను ఆరాధించే శృంగార ప్రియులను నిరాశ పరచకుండా సినిమా ఉంటుందని స్పష్టమవుతోంది.

English summary
Sunny Leone says, "I know there are plenty of male actors who are scared of being on the same screen as me because they are more 'Disney' than me. I know there are production houses who are sitting back and watching my next move to test my seriousness for my work. People might be skeptical There are wives who don't want their husbands to be working with me. Women, I don't want your husband. I have my own."
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu