»   » రిలీజ్ ట్రైలర్ : మహేష్ బాబు ప్రేమ కవిత్వం విన్నారా..అదే ఆఖరి సినిమా అట!

రిలీజ్ ట్రైలర్ : మహేష్ బాబు ప్రేమ కవిత్వం విన్నారా..అదే ఆఖరి సినిమా అట!

Subscribe to Filmibeat Telugu
రిలీజ్ ట్రైలర్ : మహేష్ బాబు ప్రేమ కవిత్వం విన్నారా..!

సూపర్ స్టార్ మహేష్ సోదరి మంజుల దర్శకత్వం వహించిన మనసుకు నచ్చింది చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నటిగా పలు చిత్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న మంజుల తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ఇటీవల హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. సూపర్ స్టార్ మహేష్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. మహేష్ వాయిస్ ఓవర్ అందించిన రిలీజ్ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది.

 మంజుల తొలిసారి దర్శకత్వం

మంజుల తొలిసారి దర్శకత్వం

నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంజుల తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా నటించారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 ముఖ్య అతిధిగా మహేష్

ముఖ్య అతిధిగా మహేష్

హైదరాబాద్ లో నిన్ననే ఘనంగా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కు మహేష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రం కోసం మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించడం విశేషం. మహేష్ ఇన్వాల్మెంట్ తో మనసుకు నచ్చింది చిత్రానికి మంచి ప్రచారం కలిగిందని చెప్పొచ్చు.


మహేష్ బాబు వాయిస్ ఓవర్.. ప్రేమ కవిత్వం

ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. తన మనసుకు నచ్చిందని మహేష్ స్పదించాడు కూడా. తాజాగా మహేష్ వాయిస్ ఓవర్ తో రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ మనసుని హత్తుకునే విధంగా ఉంది. మహేష్ రిలీజ్ ట్రైలర్ లో ప్రేమ కవిత్వాలు వల్లించాడు.


 అదే ఆఖరి సినిమా

అదే ఆఖరి సినిమా

ఈ ఈవెంట్ లో మంజుల మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంటీ దర్శకత్వంలో ఎప్పుడు నటిస్తావు డాడీ అని మహేష్ ని గౌతమ్ అడిగాడట. అలా నటిస్తే అదే నా ఆఖరి చిత్రం అవుతుందని మహేష్ సరదాగా తనని ఆటపట్టించాడని మంజుల అన్నారు.


 కవిత్వం అనుకున్నా

కవిత్వం అనుకున్నా

మహేష్ ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ మంజుల దర్శకత్వం గురించి స్పందించాడు. మంజుల కాగితంపై రాసుకుంటుంటే ఏదో కవిత్వం అయి ఉందని అనుకున్నాని మహేష్ అన్నాడు. ఆ తర్వాతే సినిమా కథ అని తెలిసిందని మహేష్ తెలిపాడు.


 తప్పకుండా నటిస్తా

తప్పకుండా నటిస్తా

తాను ఏదో ఒక రోజు తన సోదరి దర్శకత్వంలో నటిస్తానని మహేష్ తెలిపాడు. రేపు (శుక్రవారం ) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


English summary
Super Star Mahesh Babu voice over for Manasuku Nachindi movie. Mahesh attends prerelease event of this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu