»   » వామ్మో : సూపర్ స్టార్ తో 'స్నాప్ డీల్' ...20 కోట్లు

వామ్మో : సూపర్ స్టార్ తో 'స్నాప్ డీల్' ...20 కోట్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ స్నాప్ డీల్ నెంబర్ వన్ గా ఎదగటం కోసం పావులు కదుపుతోంది. అందులో భాగంగా మిస్టర్ ఫెరఫెక్షనిస్ట్ గా పేరుతెచ్చుకున్న అమీర్ ఖాన్ తో తన పోర్టల్ ని మార్కెట్ చేయాలని భావిస్తోంది. అందుకోసం 20 కోట్లు ఖర్చుపెడుతోంది. దాంతో దేశం మొత్తం తమ డిమాండ్ రెట్టింపు అవుతుందని భావిస్తోంది. త్వరలోనే ఈ యాడ్ ... టీవీల్లో రానుంది. ఇక ఇప్పటికే కోకో కోల, స్యామ్ సంగ్, గోద్రెజ్, టాటా స్కై, టైటాన్ వాచెస్ ఉత్పత్తులకు అమీర్ పనిచేస్తున్నారు. అయితే వీటిన్నటిలో స్నాప్ డీల్ అతి పెద్ద డీల్ అని చెప్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘‘ఇటీజ్‌ డిఫికల్ట్‌ టు సీ మైసెల్ఫ్‌. చూపులకు నేను చాలా పిల్లవాడిలా కనిపిస్తా. అంతేకాదు, నాలో చిన్నపిల్లాడి మనస్తత్వం కూడా ఉన్నదనుకుంటాను. నేను పోషించిన ప్రతి కేరక్టర్‌ కాస్ట్యూమ్స్‌ నాతోనే ఉంచుకుంటాను. అలాగే నా సినిమాలకు ఉపయోగించిన క్లాప్‌బోర్డ్స్‌ను కూడా దాచుకుంటాను. వాటితో ఎమోషనల్‌ ఎటాచ్‌మెంట్‌తో ఉంటాను'' అని చెప్పారు పర్‌ఫెక్షనిస్ట్‌గా అందరూ పిలిచే బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమీర్‌ఖాన్‌.

Superstar Amir Khan’s highest deal with snapdeal

అమీర్‌ఖాన్‌ మాట్లాడుతూ ‘‘ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రతిభావంతులైన దర్శకులు చాలా మంది ఉన్నారు. చాలా మంచి సినిమాలు, భిన్నమైన సినిమాలు తీస్తున్నారు. తెలుగులో రాజమౌళి, తమిళంలో శంకర్‌ వెరీ గుడ్‌ డైరెక్టర్స్‌. ప్రధాన స్రవంతిలోనే వాళ్లు ప్రయోగాలు చేస్తూ విజయాలు సాధిస్తున్నారు. హిందీ సహా నేనెక్కువగా సినిమాలు చూడను. ఎక్కు వగా పుస్తకాలు చదువుతుంటా. పుస్తకాలంటే చాలా ఇష్టం'' అని చెప్పారు.

అలాగే తన పీకే సినిమా వల్ల ఎవరి మనోభావాలు అయినా దెబ్బ తింటే వారందరినీ తాను క్షమాపణ కోరుతున్నానన్నారు. చిత్ర నిర్మాతలకు ఏ మతస్తుల మనోభావాలను దెబ్బదీసే ఉద్ధేశ్యం లేదని అమీర్ ఖాన్ స్పష్టం చేశారు. పీకే చిత్రం మనోభావాలను దెబ్బ తీస్తుందని కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చాయి. సాధువులు, మత క్రతువులను ఎండగట్టిన పీకే సినిమా విజయవంతంగా ప్రదర్శితమైంది.

ఇక అమీర్ చిత్రాల విషయానికి వస్తే...

ఐ చిత్రం తర్వాత రిలాక్స్ అవుతున్న దర్శకుడు శంకర్ రోబో చిత్రానికి సీక్వెల్ తీయాలనుకుంటున్నట్లు కోలీవుడ్ చిత్ర వర్గాల సమాచారం. ఈ మేరకు రజనీకాంత్‌తో శంకర్ చర్చలు జరిపారని తెలిసింది. రజనీతో పాటు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించే అవకాశం ఉంది. వీరిద్దరితో రోబో-2ను తమిళ, హిందీ భాషల్లో అద్భుతంగా తెరకెక్కించేందుకు శంకర్ ప్రయాత్నాలు మొదలెట్టినట్లు కోలీవుడ్ టాక్.

ఈ చిత్రానికి అయ్యే మొత్తం ఖర్చు 300 కోట్లు. దీనిలో మూడో వంతు రజనీ, అమీర్, శంకర్‌లకు పారితోషకం కాగా, నిర్మాణ వ్యయం కింద నూరు కోట్లు, ప్రచారం ఇతరత్రా ఖర్చులకు మిగిలిన వంద కోట్లుఅవుతాయని సినీ పండితుల వాదన.

English summary
Aamir Khan has been roped in as brand ambassador of online shopping portal Snapdeal. The actor was reportedly offered 20 crores deal by SnapDeal to be the face of the brand. The ad will be aired soon.
Please Wait while comments are loading...