For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సంచలనంగా సూపర్ స్టార్ కృష్ణ వీలునామా..కొడుకులను కాదని వాళ్లకు..నరేష్ పరిస్థితి ఏంటి?

  |

  సూపర్ స్టార్ కృష్ణ మరణం యావత్ సినీ లోకాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. ఆయన మరణాన్ని ఇటు సినీ, రాజకీయ సెలబ్రిటీలు, అటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆయన కుటుంబసభ్యులు అయితే తీవ్ర శోకసంద్రలో మునిగిపోయారు. నవంబర్ 16 బుధవారం రోజున సాయంత్రం కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ఆయన స్మారకార్థంగా పద్మాలయ స్టూడియోలో కృష్ణ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టంచనున్నారు. అయితే తాజాగా సూపర్ స్టార్ కృష్ణ వీలునామా, ఆస్తి ఎవరికీ దక్కుతుంది? ఎంత దక్కుతుంది? అనే విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

  కృష్ణ ఆస్తిపై పలు వార్తలు..

  కృష్ణ ఆస్తిపై పలు వార్తలు..

  సూపర్ స్టార్ కృష్ణ మరణం యావత్ సినీ లోకాన్ని తీవ్ర విషాదం మిగిల్చింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. సూపర్ స్టార్ కృష్ణ మరణాంతరం ఆయన ఆస్తి వివరాలు, వీలునామా, ఎవరికీ ఎంత రాసి ఇచ్చారనే టాపిక్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ విషయాలపై అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అందులో ప్రముఖ వినిపిస్తున్న వార్త వివరాళ్లోకి వెళితే..

  అసలు కంటే కొసరుపై ఆసక్తి..

  అసలు కంటే కొసరుపై ఆసక్తి..

  సూపర్ స్టార్ కృష్ణ వీలునామాపై ప్రముఖ వాస్తు శిల్పి, ఫినాన్షియల్ అడ్వైజర్, డాక్టర్ బీవీఎస్ఎస్ఆర్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీలునామా అనేది తదనంతరం.. అంటే మనం చనిపోయాక మన రక్త సంబంధీకులకు వచ్చే ఆస్తి అని ఆయన వీలునామాకు అర్థం చెప్పారు. అలాగే అందరికీ అసలు కంటే కొసరుపై ఎక్కువ ఆసక్తి ఉంటుందని, అందుకే కొడుకులకు కాకుండా వాళ్ల పిల్లలపై ఎక్కువ ప్రేమ చూపిస్తామని ఆ ఇంటర్వ్యూలో డాక్టర్ రెడ్డి తెలిపారు.

  కొడుకులకు రాయకుండా..

  కొడుకులకు రాయకుండా..

  సూపర్ స్టార్ కృష్ణకు మొదటి భార్య ఇందిరా, రెండో భార్య విజయ నిర్మల, వాళ్ల పిల్లలు, మనవాళ్లు, మనవరాళ్లు ఇలా ఉండటం వల్ల ఈ వీలునామా చర్చ ప్రాధాన్యత సంతరించుకుందని డాక్టర్ బీవీఎస్ఎస్ఆర్ రెడ్డి చెప్పారు.

  రెండో భార్య విజయ నిర్మలను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు కొడుకు ఉన్నాడని (నరేష్) ఆయన తెలిపారు. ఇక్కడ ఫస్ట్ భార్య పిల్లలైన మంజులకు, పద్మకు, రమేష్ బాబుకు, మహేశ్ బాబు ఉన్నారు. వాళ్లకు రాయకుండా వాళ్ల పిల్లలకు ఆస్తి రాయడమనేది జరిగిందని డాక్టర్ రెడ్డి వెల్లడించారు.

  నరేష్ కు కూడా వాటా?

  నరేష్ కు కూడా వాటా?

  మన పిల్లలకంటే వాళ్లకు పుట్టిన పిల్లలపైనే ప్రేమ ఎక్కువ ఉంటుందనడానికి సూపర్ స్టార్ కృష్ణ నిదర్శమని ఫైనాన్షియల్ అడ్వైజర్, వాస్తు శిల్పి, డాక్టర్ బీవీఎస్ఎస్ఆర్ రెడ్డి తెలిపారు. "సూపర్ స్టార్ కృష్ణ తన మనవళ్లు, మనవరాళ్ల పేరుపై వీలునామా రాశారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే.. నరేష్ గారికి కూడా వాటా వస్తుందని అందరు అనుకోవడం జరిగింది. కానీ అది రాకపోవడం అనేది శోచనీయం" అని ఆయన పేర్కొన్నారు.

  ఎక్కువగా కార్మికుల కోసమే..

  ఎక్కువగా కార్మికుల కోసమే..

  "ఇప్పుడు కృష్ణ ఆస్తి, వీలునామా అంశం ఎందుకు తెరలేచిందని అంటే.. కృష్ణ రెండో భార్య విజయ నిర్మల.. తన ఆస్తిని తన కొడుకు నరేష్ పేరు మీద కాకుండా నరేష్ పెద్ద భార్య పిల్లలపైన రాశారు. ఇలా నరేష్ కు అటు ఇటు కాకుండా ఆస్తి దక్కలేదు. వంశపారంపర్యంగా ఆస్తి వచ్చే అందరికీ సంతోషంగా ఉంటుంది. అయితే కృష్ణ గారికి కనపడని ఆస్తులు ఉన్నాయి. కానీ మిగతా వారితో పోలిస్తే కృష్ణ గారు ఎక్కువగా కార్మికుల కోసమే, వాళ్ల ఉపాధి కోసమే కొన్ని వందల చిత్రాలు నిర్మించారు. ఆయన మహానుభావుడు" అని ఫైనాన్షియల్ అడ్వైజర్, వాస్తు శిల్పి, డాక్టర్ బీవీఎస్ఎస్ఆర్ రెడ్డి వెల్లడించారు.

  రూ. 400 కోట్లకుపైగా ఆస్తి..

  రూ. 400 కోట్లకుపైగా ఆస్తి..

  ఇక నిర్మాతగా మారిన సూపర్ స్టార్ కృష్ణ అనేకంగా ప్రయోగాత్మకంగా చిత్రాలు చేశారు. అయితే వాటిలో కొన్ని విజయం సాధిస్తే మరికొన్ని తీవ్ర నష్టాలు తీసుకొచ్చిపెట్టాయి. ఇలా అనేక కారణాలతో ఆయన సంపాందించి కోల్పోయారని, సంపాందించంతా కార్మికుల కోసమే పెట్టారని తెలుస్తోంది. అలా జరిగినప్పటికీ కృష్ణ పేరిట ఆస్తి బాగానే ఉందని మరో టాక్ వినిపిస్తోంది. పద్మాలయ స్టూడియోతోపాటు స్థిర, చర ఆస్తుల విలువ రూ. 400 కోట్లకు పైగా ఉందని ప్రస్తుతం వైరల్ అవుతోన్న వార్తలు.

  English summary
  Superstar Krishna Passed Away On November 15 And He Wrote A Will To Ramesh Babu Mahesh Babu Childrens News Goes Viral
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X