»   » జియా సూసైడ్ : 27 వరకు సూరజ్‌కు జుడీషియల్ కస్టడీ

జియా సూసైడ్ : 27 వరకు సూరజ్‌కు జుడీషియల్ కస్టడీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబై : బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్యతో సంబంధం ఉన్న కేసులో...ఆమె బాయ్ ఫ్రెండ్ సూరజ్ పంచోలిని జూన్ 27 వరకు జుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ముంబై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన సూరజ్‌ను పోలీసులు జూన్ 10న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

జూన్ 13 వరకు సూరజ్‌ను పోలీసు కస్టడీకి అప్పగించిన కోర్టు...కస్టడీని మరింత పొడగించాలనే పోలీసులను విజ్ఞప్తిని తోసి పుచ్చింది. ఈ నెల 27 వరకు జుడీషియల్ కష్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా...జియా ఖాన్‌కు అబార్షన్ జరిగిన విషయాన్ని పోలీసులు నిర్ధారించారు.

జియా ఖాన్ జూన్ 3న ముంబై జుహులోని తన అపార్టుమెంటులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత పోలీసులు ఆమె ఆత్మహత్యకు కారణం కేవలం కెరీర్లో ఆటుపోట్ల వల్ల ఒత్తిడే అని భావించి కేసు నమోదు చేసుకున్నారు. కానీ జియా ఖాన్ రాసిన సూసైడ్ నోట్ దొరకడంతో ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

జియా తన లేఖలో బాయ్ ఫ్రెండ్ సూరజ్ కారణంగా మెంటల్‌గా, ఫిజికల్‌గా బాధను అనుభవించానని, సూరజ్ పంచోలి కారణంగా తాను రేప్ చేయబడ్డానని, అతను తన జీవితాన్ని నాశనం చేసాడని పేర్కొంది. జియా రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు సూరజ్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసారు.

English summary
Suraj Pancholi, held for abetting the suicide of his girlfriend and actress Jiah Khan, was on Thursday remanded in judicial custody till June 27 by a local court.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu