»   » తొలిసారిగా చిరంజీవి భార్య సురేఖ నిర్మాతగా...

తొలిసారిగా చిరంజీవి భార్య సురేఖ నిర్మాతగా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమాలో మనం ఎన్నో ప్రత్యేకతలు చూడబోతున్నారు. ఈ చిత్రానికి చిరంజీవి భార్య సురేఖ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా వెల్లడించారు. నాన్న 150వ సినిమా మైలు రాయిలాంటి సినిమా...అదులో నేను తప్పకుండా నటిస్తాను. ఒక వేళ నేను నటించే అవకాశం లేక పోయినా...ఎలాగైనా నేను సినిమాలో కనిపించేలా చూడమని దర్శకుడికి చెబుతాను అంటున్నారు రామ్ చరణ్.

చిరంజీవి 150వ సినిమా ఇందుకోసం ఇప్పటికే చాలా కథలు విన్నారు చిరంజీవి. మరింత బెస్ట్ స్టోరీ కావాలని కోరుకుంటున్నారు. చిరంజీవి కెరీర్లో అంత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు కావడంతో ఈచిత్ర కథపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నాన్న ఇమేజ్‌కు సరిపోయే కథ అందిస్తే రూ. 1 కోటి బహుమతి ఇవ్వడానికి సిద్ధమే అంటున్నారు రామ్ చరణ్.

Surekha Konidela wife to produce Chiranjeevi's 150th film

రామ్ చరణ్ ఆఫర్‌ను ఎలాగైనా దక్కించుకోవడానికి పలువురు రచయితలు పడుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇక చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఆయన పుట్టినరోజైన ఆగస్టు 22 నాటికి వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వీలైతే ఆ రోజు సినిమాకు సంబంధించిన విషయాలు ప్రకటిస్తామని రామ్ చరణ్ తెలిపారు.

English summary
Chiranjeevi's better half Surekha Konidela, who is the home minister for Konidela family, is all set to don new hat in her life. Surekha Konidela will be producing Chiru's much-anticipated 150th film. The news is reliable as it is confirmed by none other than Ram Charan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu