For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్‌ వల్లే ప్రభాస్‌తో సినిమా చేయలేకపోయా: ‘సైరా’ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్

  By Manoj
  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టైలిష్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు సురేందర్ రెడ్డి. నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'అతనొక్కడే' సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నాన్ని మొదలు పెట్టిన ఈయన.. తర్వాత టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేశాడు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా సూరీకి ఎన్నో అవకాశాలు వచ్చాయి. దీంతో ఎన్నో జోనర్లు ట్రై చేసి సత్ఫలితాన్ని రాబట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశాన్ని కూడా దక్కించుకున్నాడు. ఇటీవలే ఈయన సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి.. జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నాడు..? పూర్తి వివరాల్లోకి వెళితే...

  టెక్నికల్‌గా సూపర్ సక్సెస్

  టెక్నికల్‌గా సూపర్ సక్సెస్

  కల్యాణ్ రామ్‌తో చేసిన ‘అతనొక్కడే' తర్వాత సురేందర్ రెడ్డి పలు చిత్రాలను తెరకెక్కించాడు. ఇవి బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. అయితేనేం ఆయనకు మాత్రం మంచి పేరు వచ్చింది. సురేందర్ రెడ్డి టెక్నికల్‌గా మంచి డైరెక్టర్ అన్న ముద్ర పడింది. దీంతోనే ఆయన మెగా కాంపౌండ్‌లోకి అడుగు పెట్టాడు. ఆ ఫ్యామిలీని హీరోలతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

  ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో వచ్చాడు

  ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో వచ్చాడు

  మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ‘సైరా: నరసింహారెడ్డి'ను తెరకెక్కించాడు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను రామ్ చరణ్ తన సొంత బ్యానర్ కొణెదల ప్రొడక్షన్స్‌పై స్వయంగా నిర్మించాడు. ఎన్నో అంచనాలతో విడుదల అయిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. దీంతో సైరా సూపర్ సక్సెస్ అయింది. అయితే, కమర్షియల్‌గా అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయింది.

  ఇద్దరు స్టార్ హీరోలతో అనుకున్నారు

  ఇద్దరు స్టార్ హీరోలతో అనుకున్నారు

  ‘సైరా' సక్సెస్ తర్వాత సురేందర్ రెడ్డి.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో సినిమా చేస్తాడని, అది కూడా పాన్ ఇండియా సినిమా అని జోరుగా ప్రచారం జరిగింది. ఈ సినిమా కోసం ప్రభాస్ ‘జాన్'ను కూడా పక్కన పెట్టేశాడని కూడా వార్తలు వచ్చాయి. దీని తర్వాత సురేందర్ రెడ్డి.. సూపర్ స్టార్ మహేశ్ బాబును డైరెక్ట్ చేయబోతున్నాడని ప్రచారం మొదలైంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు' తర్వాత ఈ సినిమా ప్రారంభం అవుతుందని అన్నారు.

  మళ్లీ మెగా హీరోతోనే

  మళ్లీ మెగా హీరోతోనే

  ‘సైరా' తర్వాత సురేందర్ రెడ్డి మరోసారి మెగా హీరోతోనే సినిమా చేయబోతున్నాడని ఇటీవల ఓ వార్త బయటకు వచ్చింది. ఆ హీరో ఎవరో కాదు.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రభాస్, మహేశ్ కోసం అనుకున్న కథతోనే ఈ సినిమా పట్టాలెక్కనుందట. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని కూడా జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు, ఈ సినిమా కోసం వరుణ్ ‘బాక్సర్'ను కూడా పక్కన పెట్టేశాడని అనుకున్నారు.

  ఎన్టీఆర్ సినిమాపై షాకింగ్ కామెంట్స్

  ఎన్టీఆర్ సినిమాపై షాకింగ్ కామెంట్స్

  తాజాగా సురేందర్ రెడ్డి ఓ ప్రముఖ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అశోక్' సినిమా గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘అతనొక్కడే' హిట్ కొట్టిన తర్వాత ఎన్టీఆర్ గారి మేనేజర్ సుకుమార్ నన్ను ఓ చోటుకు తీసుకెళ్లాడు. తారక్ సార్‌తో సినిమా చేయాలని మూడు రోజుల పాటు నన్ను మెంటల్‌గా బ్లాక్‌మెయిల్ చేశాడు. ఇందుకోసం ఓ కథను నా చేతిలో పెట్టారు. దీంతో ఇష్టం లేకున్నా ఆ సినిమా చేయాల్సి వచ్చింది' అని సూరీ చెప్పుకొచ్చాడు.

  #CineBox : Balakrishna Suggestions To Boyapati Sreenu For Their Upcoming Film !
  ప్రభాస్‌తో కమిట్ అయినా...

  ప్రభాస్‌తో కమిట్ అయినా...

  ఎన్టీఆర్ సినిమా కోసం ప్రభాస్‌తో కమిట్‌మెంట్‌ను పక్కన పెట్టేశానని సురేందర్ రెడ్డి వెల్లడించాడు. ‘వాస్తవానికి నేను ప్రభాస్‌తో సినిమా చేయడానికి కమిట్‌మెంట్ ఇచ్చాను. అయితే, ‘అశోక్' సినిమా చేయడం వల్ల ఆయనతో పని చేసే అవకాశాన్ని కోల్పోయాను. ఈ సినిమా ఫ్లాప్ అవడం వెనుక నా పొరపాట్లు కూడా ఉన్నాయి' అని ఆయన పేర్కొన్నాడు.

  English summary
  Director Surender Reddy recently met actor Varun Tej, setting off speculation that he may rope in the actor for his next film instead of Prabhas. Varun Tej, who was supposed to do a film with debutant director Kiran Korrapati, may give preference to Surender Reddy, who recently garnered plenty of appreciation for Sye Raa.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X