‘సైరా’ అందరి అంచనాలు మించిపోయేలా ఉంటుంది: సురేందర్ రెడ్డి
Recommended Video

చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న సైరా నరసింహారెడ్డి టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు సురేందర్ రెడ్డి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి మన తెలుగు గడ్డపై తొలి స్వాతంత్ర్య సమరయోధుడు. అతడి గురించి చాలా మందికి తెలియదు. ఈ సినిమా టేకాఫ్ చేసిన తర్వాత సంవత్సరం పాటు రీసెర్చ్ చేశాం. ఆ టైమ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారాలతో సహా ఉన్నాయి. ఆధారాలను తీసుకుని సినిమా చేశామన్నారు.

నేను గర్వపడే సినిమా
ఇలాంటి సినిమా చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ సినిమా చిరంజీవిగారు చేయడం అనేది నా అదృష్టం. ఆయన ఎంత యాప్ట్ అనేది షూటింగ్ చేసిన తర్వాత అర్థమైంది.

చిరంజీవి డూప్ లేకుండా..
చిరంజీవిగారు ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. ప్రతిదీ డూప్ లేకుండా తనే చేస్తున్నాడు. ఆయన్ను చూసిన తర్వాత నేను ఇప్పటి వరకు నేరచుకుంది ఏమీ లేదు... నేర్చు కోవాల్సి చాలా ఉంది అనిపించింది. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ చరణ్. ఈ సినిమాకు ఏం కావాలో అనుకున్న దానికంటే ఎక్కువే చేస్తున్నారు. ఆయన లేకుంటే ఈ సినిమా లేదు. ప్యాషన్‌తో ముందుకు తీసుకెళ్తున్నారు అన్నారు.

అంచనాలు మించే మూవీ
ఈ సినిమాకు మేజర్ ప్లస్పాయింట్ రత్నవేలు, రాజీవన్. నేనే సినిమా చేసి ఎడిటింగ్ రూమ్‌లో చూసుకున్నప్పుడు కొత్త ఫీలింగ్ ఉంది. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్, సాయిగారు.. అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. ఇది టీమ్ వర్క్. అద్భుతంగా జరుగుతోందని తెలిపారు. నేను ఇంతకు ముందు చేసిన సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. ఈ సినిమా అందరి అంచనాలు మించి ఉంటుంది. ఎంతైనా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు అన్నారు.
చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్
ఈ సినిమాకు మ్యజికల్ జీనియస్ అమిత్ త్రివేది పని చేస్తున్నారు. ఆయన్ని నా సినిమాకు ప్రొవైడ్ చేయడం చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్. ఈ సినిమాకు అమిత్‌గారు పెద్ద ఎసెట్ అని సురేందర్ రెడ్డి తెలిపారు.


Click it and Unblock the Notifications











