»   » అల్లు అర్జున్ ని తిట్టినా... (సురేంద్ర రెడ్డి ఇంటర్వూ)

అల్లు అర్జున్ ని తిట్టినా... (సురేంద్ర రెడ్డి ఇంటర్వూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బన్నీ తన వృత్తిని బాగా ప్రేమిస్తాడు. ప్రతీది కొత్తగా చేయాలనే తపన అతనిలో కనిపిస్తుంది. సెట్‌లో ఏ విషయంలోనైనా అభిప్రాయబేధాలు వచ్చి అతన్ని తిట్టినా సరే దాన్ని మనసులో పెట్టుకోకుండా వెంటనే కలిసిపోతాడు. అతని వ్యక్తిత్వంలోని గొప్ప సుగుణమది అంటూ చెప్పుకొచ్చారు సురేంద్రరెడ్డి.

'అతనొక్కడే', 'కిక్‌' చిత్రాలు చూస్తే సురేంద్ర రెడ్డి పనితనం ఏమిటో తెలుస్తుంది. తాజాగా అల్లు అర్జున్‌ హీరోగా 'రేసుగుర్రం' తెరకెక్కించారాయన. రేపు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకొస్తుందీ చిత్రం. ఈ సందర్భంగా సురేందర్‌ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు. ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇలా స్పందించారు.

అలాగే సినిమాలు వెంట వెంటనే సినిమాలు చేయలేను. అలా చేయడం నాకు ఇష్టం ఉండదు కూడా. ఒక కథ అనుకొన్నాక... సెట్స్‌పైకి తీసుకెళ్లకముందే దానిపై సుదీర్ఘమైన కసరత్తులు చేస్తుంటాను. అందుకే సినిమా సినిమాకీ మధ్య విరామం వచ్చినట్లనిపిస్తుంటుంది .వినోదం, కుటుంబ అనుబంధాలు, యాక్షన్‌... ఇలా అన్నీ సమపాళ్లల్లో మేళవించి తీసిన సినిమా ఇది. అలా కొన్నిసార్లు మాత్రమే కుదురుతుంది అంటూ సినిమా విశేషాలు వివరించారు.

అవి ఆయన మాటల్లో...స్లైడ్ షోలో...

హీరో పేరు అదే...

హీరో పేరు అదే...

ఒక పోలీసు అధికారికి తమ్ముడిగా అల్లు అర్జున్ కనిపిస్తాడు. ఆ పాత్ర పేరు.. లక్కీ. మలయాళంలో ఆ పేరుతోనే సినిమాను విడుదల చేస్తున్నాం.
'రేసుగుర్రం' అనే పేరు హీరో పాత్ర ఆధారంగానే పెట్టాం. ఎప్పుడూ రేసుగుర్రానికి లక్ష్యంపైన మాత్రమే గురి. అది పక్కకు చూడదు. ఇందులో బన్నీ పాత్ర కూడా అంతే. ఒక్కసారి మనసులో అనుకొంటే ఇక దాన్ని సాధించేవరకూ వదిలిపెట్టడు.

ప్లెయిన్ స్క్రీన్‌ప్లే

ప్లెయిన్ స్క్రీన్‌ప్లే

అల్లు అర్జున్ ఎక్కడో ఓ చోట ఖాకీ చొక్కాలో కనిపించినంత మాత్రాన అతను పోలీస్ కాదు. శ్యామ్ పోలీస్ ఆఫీసర్. శ్యామ్‌కి పుస్తకాల్లో ఉన్నదే వేదం. బన్నికి మనసు ఏం చెప్తే అదే వేదం. వీళ్లిద్దరూ తరచూ కీచులాడుకుంటారు. అవి పెద్ద గొడవలు కాదు. కానీ వీరి తల్లికి మాత్రం వీరిద్దరిని రామలక్ష్మణుల్లా చూడాలని ఉంటుంది. సినిమాలో ప్లెయిన్ స్క్రీన్‌ప్లే ఉంటుంది. ట్విస్ట్‌లుండవు.

కొత్త అనుభవం

కొత్త అనుభవం

''ఇప్పటిదాకా నేను తీసిన చిత్రాలకి భిన్నమైనది 'రేసుగుర్రం'. ఇదివరకు హీరో పాత్రల ఆధారంగా సినిమాలు తీశాను. ఇది మాత్రం కుటుంబ అనుబంధాల్ని ఆసరాగా చేసుకొని తీశా. దర్శకుడిగా ఓ కొత్త అనుభవాన్నిచ్చింది. బన్ని ఎనర్జీకి సరిపోయే టైటిల్ ఇది. బన్నిని దృష్టిలో పెట్టుకునే 'రేసుగుర్రం' కథను సిద్ధం చేసుకున్నాం. చిన్న యాక్షన్ ఉన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. నేను ఇప్పటిదాకా చేయని వైవిధ్యమైన సినిమా.

కథ అలా పుట్టింది

కథ అలా పుట్టింది

అల్లు అర్జున్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కథను తయారు చేశాము. బన్నీ (అల్లు అర్జున్) ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా వుంటాడు. ఆయన సెట్‌లోకి అడుగుపెట్టగానే అందరిలో ఏదో తెలియని జోష్ వస్తుంది. ఎవరైనా డల్‌గా కనిపిస్తే తన మాటలతో ఆయన వారిని వెంటనే ఉత్సాహపరుస్తారు. ఓ రకంగా బన్నీ వ్యక్తిత్వంలోంచే ‘రేసుగుర్రం' కథ పుట్టిందని చెప్పొచ్చు.

ఆ సినిమాలుతో సంభంధం లేదు

ఆ సినిమాలుతో సంభంధం లేదు

తమిళ ‘వేట్టయ్', హిందీ ‘రామ్‌లఖన్' సినిమాలకీ ఈ సినిమాకీ అస్సలు పోలిక లేదు. నేనిప్పటివరకు చేసిన సినిమాల్లో వినోదం, యాక్షన్ ఉంటాయి. ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. ఈ వేసవికి కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి చిత్రాన్ని ఇస్తున్నాం.

విలన్ ప్రత్యేకత..

విలన్ ప్రత్యేకత..

భోజ్‌పూరి సూపర్‌స్టార్ రవికిషన్ విలన్‌గా ఎంచుకోవడానికి కారణం..కథానుగుణంగా ఈ చిత్రంలో విలన్ పాత్ర కొత్త పంథాలో వుంటుంది. సీరియస్‌గా కనిపిస్తూనే విలనీ పండించే పాత్ర అది. ఈ పాత్రకు రవికిషన్ అయితేనే పక్కాగా సరిపోతాడనిపించింది.

స్టైల్..

స్టైల్..

ఒక పాత్రో, సన్నివేశమో అని కాకుండా... సినిమా మేకింగ్‌లోనే స్త్టెల్‌ ఉండాలనేది నా సిద్ధాంతం. అందరూ నా స్త్టెలిష్‌ మేకింగ్‌ గురించి మాట్లాడుతుంటారు. అయితే... స్త్టెల్‌ విషయంలో నాకంటే అల్లు అర్జున్‌ రెండడుగులు ముందుంటారు. తాను కనిపించే విధానంలోనే ఓ ప్రత్యేకత ఉంటుంది. మా ఇద్దరి అభిరుచులు ఈ సినిమాకి కొత్త హంగును తీసుకొచ్చాయి. ఇదివరకటి సినిమాలకంటే ఇందులో మరింత అందంగా కనిపిస్తాడు బన్నీ.

అంతా ఇక్కడే తీసాం..

అంతా ఇక్కడే తీసాం..

"మొత్తం హైదరాబాద్‌లోనే చిత్రీకరించాం. హైదరాబాద్‌ను కొత్తగా చూపించాలని కెమెరామేన్‌గా మనోజ్‌ను ఎంపిక చేసుకున్నాం. తను తమిళంలో తెరకెక్కించిన 'ఈరమ్' చూశాను. చాలా మంచి కెమెరాపనితనం అనిపించింది. ఈ సినిమా కథలో అతను చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యాడు.

లైట్స్ స్పెషాలిటీ...

లైట్స్ స్పెషాలిటీ...

కెమెరామెన్...ఈ చిత్రానికి 12 కేవీ లైట్‌ను వాడాడు. ఆ లైట్ చాలా ఖరీదైంది. మామూలుగా అక్కడా ఇక్కడా కొన్ని సన్నివేశాలకే ఆ లైటును వాడతారు. కానీ ఈ సినిమా ఆద్యంతం మేం 105 రోజులు పనిచేస్తే అన్ని రోజులు ఆ లైట్‌ను వాడాం. మా నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా అడిగిన అన్ని సదుపాయాలను కల్పించారు. ఆ లైట్ వల్ల సినిమాకు ప్రత్యేకమైన లుక్ వచ్చింది.

పాటలు

పాటలు

తమన్ చాలా మంచి ట్యూన్లిచ్చారు. ఎప్పటికప్పుడు బెటర్‌మెంట్ కోసం ప్రయత్నించేవారు. వరికుప్పల యాదగిరి రాసిన పాటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎప్పటికైనా వరికుప్పల గొప్ప సంగీత దర్శకుడవుతాడు

అల్లు అర్జున్ గురించి...

అల్లు అర్జున్ గురించి...

నేను ఇప్పటిదాకా పనిచేసిన హీరోల్లో నేను బాగా చనువుగా ఉండేది అల్లు అర్జున్‌తోనే. ఏమైనా అనాలనిపించినా అనేయగల చనువుంది. అలాగే నాలుగు రోజులు అలిగినా ఫర్వాలేదు. తర్వాత మాట్లాడగలను. అంత క్లోజ్‌గా ఉంటారు నాతో

తదుపరి ప్రాజెక్టులు..

తదుపరి ప్రాజెక్టులు..

"కల్యాణ్‌రామ్ నిర్మాతగా రవితేజ హీరోగా 'కిక్ 2'ను తెరకెక్కించబోతున్నాను. జూలై, ఆగస్టులో ఈ సినిమా మొదలవుతుంది. 'కిక్'కి ఇది సీక్వెల్ కాదు. అందులోని ఓ పాత్రను తీసుకుని ఆద్యంతం కొత్తగా తెరకెక్కిస్తాం. మంచి సోషల్ ఎలిమెంట్ ఉంటుంది. అంతలోపు ఠాగూర్ మధుతో కలిసి అందరూ కొత్తవారితో ఓ సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇది ప్రేమకథా చిత్రం.'

English summary
Surendra Reddy says..."Allu Arjun is the most comfortable actor. I have developed a special bond with him. He also gave lot of inputs while shooting. You must have seen that 'Daavuda..' word he used in the trailer. It was his idea."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu