»   » ఈ సినిమా ఆడకపోతే ఊరెళ్లిపోదాం.. భార్యతో సురేష్ బాబు.. రానాను చూసి కంటతడి!

ఈ సినిమా ఆడకపోతే ఊరెళ్లిపోదాం.. భార్యతో సురేష్ బాబు.. రానాను చూసి కంటతడి!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  తెలుగు చిత్ర పరిశ్రమలో సురేష్ ప్రొడక్షన్ అతిపెద్ద నిర్మాణ సంస్థ. ఈ సినిమా బ్యానర్ నుంచి పలువురు హీరోలు, దర్శకులు, ఆర్టిస్టులు ఎందరో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇలాంటి ఘనత ఉన్న ప్రొడక్షన్ సంస్థ అధిపతి, నిర్మాత సురేష్ బాబు తన కుమారుడు రానా దగ్గుబాటిని సొంత బ్యానర్లో పరిచయం చేయకపోవడం పలువురిని ఆశ్చర్యపరిచింది. రానాను సొంత బ్యానర్‌లో నటింప చేయడానికి చాలా ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ అంశంపై ఇటీవల నిర్మాత సురేష్‌బాబు వివరణ ఇచ్చారు.

  ఖైదీ లాంటి సినిమా చేయాలని..

  ఖైదీ లాంటి సినిమా చేయాలని..

  ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఖైదీ లాంటి మాస్, యాక్షన్ కథతో రానాను హీరోగా పరిచయం చేయాలని అనుకున్నాం. అలాంటి కథ కోసం చాలా రోజులు వెతికాను. అదే సమయంలో దర్శకుడు శేఖర్‌కమ్ముల లీడర్ సినిమాను రానాతో చేయాలని వచ్చారు. నాకు నచ్చినా, నచ్చకపోయినా ఒకే చెప్పాను అని సురేష్ బాబు అన్నారు.

  Bigg Boss Telugu : Rana Daggubati grand entry For Nene Raju Nene Mantri promotions
  అందుకే విలన్‌గా ఓకే చెప్పాను..

  అందుకే విలన్‌గా ఓకే చెప్పాను..

  బాలీవుడ్‌లో శతృఘ్నసిన్హా, వినోద్‌ఖన్నా లాంటి పెద్ద హీరోలు ప్రారంభంలో విలన్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. ఆ తర్వాత అగ్ర హీరోలుగా గుర్తింపును తెచ్చుకున్నారు. వారి బాటలోనే రానా అడుగులు వేస్తే బాగుంటుందని అనిపించింది. బాహుబలిలో విలన్ అనగానే ఒకే చెప్పాను అని సురేష్ బాబు పేర్కొన్నారు.

  అందుకే ఊగిపోయేవాడిని

  అందుకే ఊగిపోయేవాడిని

  సొంతంగా పెద్ద నిర్మాణ సంస్థ ఉండి కూడా నా కుమారుడిని పరిచయం చేయలేకపోతున్నానని లీడర్ సినిమా నుంచి రోజు ఒళ్లంత ఊగిపోయింది. నా మనసుకు నచ్చినట్లుగా సూపర్‌హీరో, విలన్ తరహా కథతో రానాతో సినిమా చేయాలని ఉండేది. అందుకోసం చాలా ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో నేను కన్న కలలన్నీ సాకారమయ్యాయి. ఫలితం ఏదైనా మంచి సినిమా చేశామనే సంతృప్తిని మిగిల్చింది.

  తేజ కథ సూపర్.. డిఫెరెంట్‌గా..

  తేజ కథ సూపర్.. డిఫెరెంట్‌గా..

  సొంత ప్రొడక్షన్‌లో రానా కోసం మంచి కథలను వెతుకుతున్న సమయంలో తేజ వినిపించిన కథ నన్ను ఆకట్టుకున్నది. ఈ చిత్రంలోని ఎమోషన్ సీన్లలో రానా నటన చూసి కన్నీళ్లు వచ్చాయి. తన స్లయిల్ భిన్నంగా తేజ చేసిన ఓ డిఫరెంట్ సినిమా. మంచి సినిమాను తెరకెక్కిస్తాడనే నమ్మకంతోనే తేజతో సినిమా చేశాం.

  సినిమా కథ ఇదే..

  సినిమా కథ ఇదే..

  జీవితంలో ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉంటుంది. వాటి కోసం కొందరు తప్పుడు మార్గాలు అనుసరిస్తారు. నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో తను ప్రాణంగా ప్రేమించిన రాధ (కాజల్) కోసం జోగేంద్ర ఏ దారిని ఎంచుకున్నాడన్నదే ఈ చిత్ర కథ అని సురేష్ బాబు మీడియాకు వెల్లడించారు.

  రానా డామినేట్ చేస్తున్నాడు..

  రానా డామినేట్ చేస్తున్నాడు..

  నేను చిత్రసీమలోకి వచ్చి మా నాన్నను ఎలా డామినేట్ చేశానో ఇప్పుడు రానా నన్ను డామినేట్ చేస్తున్నాడు. మా నాన్న మాదిరిగానే తనలో సినిమా పట్ల తపన ఎక్కువ. నేను ఇప్పటికీ భయపడుతూనే సినిమాలు రూపొందించాను. నేను నిర్మించే ప్రతి చిత్రం సక్సెస్ సాధిస్తుందా లేదా అనే భయం వెంటాడుతుంటుంది. చాలా సార్లు నా భార్యతో సినిమా ఆడకపోతే ఊరెళ్లిపోదాం అని చెబుతుంటాను. అలా చాలా సార్లు ఊరికి వెళ్లొచ్చాను అని సురేష్ బాబు చమత్కరించారు.

  11న నేనే రాజు సినిమా రిలీజ్

  11న నేనే రాజు సినిమా రిలీజ్

  నిర్మాత సురేష్‌బాబు. భరత్‌చౌదరి, వీ కిరణ్‌రెడ్డితో కలిసి ఆయన నిర్మిస్తున్న చిత్రం నేనే రాజు నేనే మంత్రి. రానా, కాజల్ అగర్వాల్, కేథరిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తేజ దర్శకుడు. ఈ నెల 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర ప్రమోషన్‌ను ఆదివారం ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షోలో రానా ప్రమోషన్ చేపట్టిన సంగతి తెలిసిందే.

  English summary
  Producer Suresh Babu is doing a film with his son Rana Daggubati. After some many years of Rana entry into film industry, Suresh Production Picturised Nene Raju Nene Mantri. This film is releasing on August 11th. In this occassion, Suresh Babu met with media. Suresh Babu told his wife that if Nene Raju Nene Mantri fails.. I will not produce films.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more