ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ మార్క్ కి 24

సూర్య కథానాయకుడిగా ప్రేక్షకులముందుకు వచ్చిన '24' మూవీ, విడుదలైన ప్రతిచోట విశేషంగా వసూళ్లు రాబడుతోంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. టైం ట్రావెల్ అనే వినూత్న అంశంతో సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.

సూర్య అద్భుతమైన నటన, దర్శకుడు విక్రమ్ కుమార్ స్క్రీన్ ప్లే ప్రతిభ ఈ సినిమాను హిట్ చేశాయి. మంచి రివ్యూలు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తో ఈ సినిమా అనుకునట్లుగానే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని రాబడుతుంది.

ఓవర్సీస్ మార్కెట్ విషయానికి వస్తే ఈ సినిమా అరుదైన రికార్డ్ సాధించింది. తోలి వీకెండ్ లోనే 24 సినిమా ఉత్తర అమెరికాలో మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టింది. ఉత్తర అమెరికాలో మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించిన తోలి సూర్య సినింగా 24 రికార్డ్ సృష్టించింది. ఈ విషయాన్ని ఉత్తర అమెరికాలో ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్న సినీగెలాక్సీ ఇంక్‌ తాజాగా వెల్లడించింది.

Suriya and Director Vikramkumar movie 24 touches million dollar

తెలుగు .. తమిళ వెర్షన్స్ కలుపుకుని ఈ సినిమా, వీకెండ్ ముగిసేసరికి యూఎస్ లో 1 మిలియన్ డాలర్ మార్క్ కి చేరుకుందని సమాచారం. తమిళ చిత్రపరిశ్రమకి సంబంధించినంత వరకూ ఇది విశేషమేనని చెబుతున్నారు.

ఈ సినిమా టైమ్ ట్రావెల్ కి సంబంధించిన కథాంశంతో రూపొందడంతో, అందరిలోనూ విపరీతమైన ఆసక్తికి కారణమైంది. సూర్య మూడు పాత్రల్లో కనిపించడం గొప్ప విషయం కాకపోయినా, ఆ మూడు పాత్రల్లోని వైవిధ్యం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది.

ఈ మూడు పాత్రలను విభిన్నంగా తీర్చిదిద్దడంలో విక్రమ్ కుమార్ కి నూటికి నూరు మార్కులు పడిపోయాయి. కథ .. కథనం .. గ్రాఫిక్స్ సమపాళ్లలో తమ పాత్రలను పోషించిన కారణంగానే, ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X