»   » సూర్య కొత్త చిత్రం తెలుగు రైట్స్ దక్కించుకున్న నిర్మాత!

సూర్య కొత్త చిత్రం తెలుగు రైట్స్ దక్కించుకున్న నిర్మాత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళంతో పాటు తెలుగులోనూ మంచి స్టార్‌డమ్‌ కలిగిన కథానాయకుడు సూర్య. గజిని, యముడు, సింగం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్నాడు. ఇక తమిళ చిత్రసీమలో సంచలనాలకు తాజా చిరునామాగా నిులుస్తున్న దర్శకుడు పాండిరాజ్‌. ‘పసంగ, మెరీనా, కేడి బిల్లా`కిలాడి రంగా' వంటి బ్లాక్‌బస్టర్స్‌తో ‘స్టార్‌ డైరెక్టర్‌' ఇమేజ్‌ సొంతం చేసుకొన్న దర్శకుడతను. అందుకే.. ‘సూర్య పాండిరాజ్‌ కాంబినేషన్‌'లో తమిళంలో రూపొందుతున్న చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అందులోనూ ఈ చిత్రాన్ని తమిళంలో సూర్య స్వయంగా నిర్మిస్తుండడం మరో ముఖ్య విశేషం.

సూర్య సరసన అమలాపాల్‌ నటిస్తుండగా.. మన తెలుగమ్మాయి బిందుమాధవి ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. షూటింగ్‌ దాదాపుగా పూర్తి కావచ్చిన.. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం తెలుగు హక్కుల్ని అత్యంత తీవ్ర పోటీ నడుమ ‘సాయిమణికంఠ క్రియేషన్స్‌' అథినేత జూలకంటి మధుసూదన్‌రెడ్డి సొంతం చేసుకొన్నారు. సూపర్‌స్టార్‌ సూర్య కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సగర్వ సమర్పణలో.. ‘2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ స్టూడియో గ్రీన్‌ మరియు శ్రీఓబులేశ్వర ప్రొడక్షన్స్‌తో కలిసి సాయిమణికంఠ క్రియేషన్స్‌ పతాకంపై జూలకంటి మధుసూదన్‌రెడ్డి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు.

Suriya-Pandiraj film telugu release details

ఈ సందర్భంగా నిర్మాత జూలాకంటి .మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తమిళంలో సూపర్‌స్టార్‌ సూర్య నిర్మిస్తున్న సినిమాను.. ఆయన సమర్పణలో తెలుగు ప్రేక్షకులకు అందించే అవకాశం లభించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందరో పెద్ద నిర్మాతలు ఈ చిత్రం తెలుగు హక్కుల కోసం పోటీ పడినా.. మా మీద నమ్మకంతో ఈ అవకాశం మాకే ఇచ్చారు. ఈ సినిమా హక్కులు మేం తీసుకొన్నామని తెలుసుకొన్న మరుక్షణం.. ఇటీవలే ‘జిల్లా' చిత్రంతో సూపర్‌హిట్‌ సొంతం చేసుకొన్న ‘శ్రీఓబులేశ్వర ప్రొడక్షన్స్‌' అధినేతలు ప్రసాద్‌ సన్నితి~ తమటం కుమార్‌రెడ్డి ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకొంటున్నారు' అన్నారు.

శశాంక్‌ వెన్నెలకంటి సంభాషణలు సమకూర్చుతున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: బాసుబ్రమణియం, కూర్పు: ప్రవీణ్‌ కె.ఎల్‌, సంగీతం: అర్రోల్‌ కొర్రెల్ , సమర్పణ: సూపర్‌స్టార్‌ సూర్య~ కె.ఇ.జ్థాన్‌వేల్‌రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్‌రెడ్డి, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: పాండిరాజ్‌!!

English summary
Sai Manikanta Creations acquired telugu rights of Suriya-Pandiraj film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu