»   »  ఫోటో: ‘బాహుబలి’ టీమ్‌తో తమిళ సూపర్ స్టార్ సెల్ఫీ!

ఫోటో: ‘బాహుబలి’ టీమ్‌తో తమిళ సూపర్ స్టార్ సెల్ఫీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి'. ఈ చిత్రం తమిళ ట్రైలర్ రిలీజైంది. ఈ లాంచ్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన సూర్య, బాహుబలి తమిళ వర్షన్ కోసం తమిళ నాట తానే స్వయంగా ప్రచారం నిర్వహిస్తానని చెప్పినట్టుగానే బాహుబలి ట్రైలర్ లాంచ్‌కు విచ్చేశారు. బాహుబలి సినిమాను ప్రమోట్ చేయడం తన బాధ్యతని, గర్వంగా కూడా ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ట్రైలర్ లాంచ్ తర్వాత బాహుబలి టీమ్‌తో సూర్య ఇలా ఓ సెల్ఫీకి పోజిచ్చారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేస్తూ ..సెల్ఫీని ఇక్కడ పోస్ట్ చేసారు.

సూర్య మాట్లాడుతూ.... బాహుబలి' బడ్జెట్‌లోనే కాదు కష్టంలోనూ అత్యుత్తమ చిత్రం. భారతీయ సినిమా గర్వించదగ్గ సినిమా. ఇండియన్‌ సినిమా గొప్పతనాన్ని ఈ చిత్రం ప్రపంచానికి చూపబోతుంది. ఈ తరానికి చరిత్ర నేపథ్యంతో కూడిన ఇటువంటి బ్రహ్మాండమైన చిత్రాన్ని అందించడం అసాధ్యం. అటువంటిది ఇంతటి గొప్ప సినిమాని సృష్టించిన ‘బాహుబలి' టీమ్‌కి నా సెల్యూట్‌.
రాజమౌళి సార్‌కి ఒక విజ్ఞప్తి... ఇక్కడి యువ దర్శకులు ఈ సినిమా ఎలా తీశారో తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నారు. ఒక్కసారి మీరు వచ్చి వారికి వివరిస్తే బాగుంటుంది. ప్రేక్షకులకీ ఒక సలహా.. ‘బాహుబలి' సినిమాని చూడడం మిస్‌ చేసుకోకండి.

Suriya's striking selfie with Baahubali team

‘బాహుబలి ది బిగినింగ్‌'గా పిలవబడుతున్న మొదటి భాగానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ జూన్ 1నే విడుదలైన విషయం తెలిసిందే! ముంబైలోని ఓ ఈవెంట్‌లో బాహుబలి టీమ్, హిందీ పంపిణీదారుడు కరణ్ జోహర్‌లు పాల్గొని హిందీ, తెలుగు ట్రైలర్‌లను లాంచ్ చేయగా, తమిళ ట్రైలర్‌ను చెన్నైలో జూన్ 5న గ్రాండ్‌గా విడుదల చేశారు.

భారీ తారాగణం, గొప్ప సాంకేతిక నిపుణులు, లెక్కకు మించి కార్మికులు ‘బాహుబలి' రూపకల్పనలో పాలుపంచుకున్నారు. ‘ఈ చిత్రం కోసం ఎంత మంది పనిచేశారు?' అని దర్శకుడు రాజమౌళిని అడిగితే, ‘లేక్కే లేదు' అని బదులిచ్చారు. కొన్ని వేలమంది ఈ సినిమా కోసం పనిచేశారని, ఎంతమంది పనిచేశారో చెప్పడం అసాధ్యమని ఆదివారం చెన్నైలో జరిగిన ‘బాహుబలి' తమిళ ట్రైలర్‌ ఆవిష్కరణ వేడుకలో రాజమౌళి పేర్కొన్నారు.

English summary
Suriya Sivakumar tweeted: " With the mammoth team of #Baahubali at the trailer launch!! ". Actor Suriya's striking selfie with team Baahubali is trending in Social Media. Have a peek at the selfie here!
Please Wait while comments are loading...