For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్రేకింగ్: పీకల్లోతు కష్టాల్లో రియా చక్రవర్తి.. ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు!

  |

  బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో దర్యాప్తు చేపట్టేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుపై దేశవ్యాప్తంగా నెటిజన్లు సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ నేతలు ఈడీ విచారణకు డిమాండ్ చేయడం తెలిసిందే. బీజేపీతోపాటు సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపణల నేపథ్యంలో దివంగత హీరో ఆర్థిక వ్యవహారాల్లో చోటుచేసుకొన్న అవకతకవలపై ఈడీ దర్యాప్తు చేయడానికి సిద్ధమైంది. ఈడీ దర్యాప్తుకు సంబంధించి మరిని వివరాలు..

  #RheaChakraborty : Sushant కేసు.. రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ, మనీలాండరింగ్ కేసు నమోదు!
  రియా చక్రవర్తిపై ఆర్థిక నేరారోపణలు

  రియా చక్రవర్తిపై ఆర్థిక నేరారోపణలు

  సుమారు 15 కోట్లకుపైగా డబ్బు కాజేసిందని రియా చక్రవర్తిపై సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ చేసిన ఫిర్యాదు మేరకు పాట్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రియాతోపాటు మరో ఐదుగురు సుశాంత్ స్నేహితులపై కేసు నమోదు చేయడం గమనార్హం. ఐపీసీ సెక్షన్ 306, 340, 342, 380, 406, 420 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు అని పాట్నా సెంట్రల్ జోన్, ఐఐజీ సంజయ్ సింగ్ ధృవీకరించారు. ఇప్పటికే పాట్నా పోలీసు బృందం ముంబైలో దర్యాప్తు మొదలుపెట్టింది అని తెలిపారు.

  ఈడీ దర్యాప్తుకు పఢ్నవీస్ ట్వీట్

  ఈడీ దర్యాప్తుకు పఢ్నవీస్ ట్వీట్

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం విషయంలో భారీగా ప్రజల సెంటిమెంట్ బలపడుతున్నది. ముంబై పోలీసుల దర్యాప్తు, రాష్ట్ర ప్రభుత్వ జోక్యంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నవి. ఈ క్రమంలో సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల దుర్వినియోగం విషయంలో మనీలాండరింగ్ జరిగిందా అనే కోణంలో విచారణ జరపడానికి ఈసీఐఆర్‌ను ఈడీ రిజిస్టర్ చేయాలి అని దేవేంద్ర పఢ్నవీస్ ట్వీట్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకొన్నది.

  సుశాంత్ కేసు విచారణకు ఈడీ రంగంలోకి

  సుశాంత్ కేసు విచారణకు ఈడీ రంగంలోకి

  సుశాంత్ మరణంపై ముంబై పోలీసుల దర్యాప్తు ఓ వైపు జరుగుతుంటే ఈడీ అధికారులు తాజాగా మనీ లాండరింగ్ కేసును నమోదు చేశారు. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల్‌లో భారీగా నిధుల మళ్లింపు, అవకతకవలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఈడీ కేసు నమోదు చేసింది. సుశాంత్ మరణానికి సంబంధించిన కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టడం ఇదే మొదటిది. ఇప్పటి వరకు ఈ కేసు దర్యాప్తు బీహార్, మహారాష్ట్ర వరకే పరిమితమైంది.

  మనీలాండరింగ్ కేసు నమోదు

  మనీలాండరింగ్ కేసు నమోదు

  తాజాగా ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద కేసును నమోదు చేసిన ఈడీ అధికారులు కీలక ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. పాట్నాలో కేకే సింగ్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని సమర్పించాలని అధికారులు కోరారు. అలాగే రియా చక్రవర్తిపై చేసిన ఫిర్యాదు కాపీలు, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ అప్పగించాలని సూచించారు.

  సీబీఐ విచారణకు పెరుగుతున్న డిమాండ్

  సీబీఐ విచారణకు పెరుగుతున్న డిమాండ్

  ఇప్పటికే సుశాంత్ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించాలని పలు వర్గాల నుంచి డిమాండ్ వస్తున్నది. బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు, ప్రముఖ లాయర్లు, ఇతర సామాజిక కార్యకర్తలు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. గత 10 రోజులకుపైగా సిబీఐ విచారణకు అనేక వర్గాల నుంచి డిమాండ్ వెల్లువెత్తుతున్నది.

  English summary
  Sushant Singh Rajput Case: Sushant Singh Rajput father KK Singh alleges Rhea Chakraborty exploited financially. KK Singh has filed an FIR against Rhea Chakraborty in Rajiv Nagar Police station in Patna. In this occassion, Devendra Fadnavis tweeted that, There is a huge public sentiment about handing over #SushantSinghRajput case to CBI but looking at the reluctance of State Government, atleast dir_ed ED can register an ECIR since misappropriation and money laundering angle has come out.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X