twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ హీరోగా ‘చి ల సౌ’, దర్శకుడిగా మారిన హీరో రాహుల్ .... (ఫోటోస్)

    సుశాంత్ హీరోగా చి ల సౌ మూవీ ప్రారంభం అయింది. ఈ చిత్రానికి హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తారు.

    By Bojja Kumar
    |

    సుశాంత్‌, రుహానీ శ‌ర్మ హీరో హీరోయిన్లుగా సిరుని సినీ కార్పొరేష‌న్ బేన‌ర్‌పై కొత్త చిత్రం హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో బుధ‌వారం ప్రారంభ‌మైంది. ఈ చిత్రంతో హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు.

    తేజ్‌వీర్ నాయుడు స‌మ‌ర్ప‌ణ‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భరత్ కుమార్ మలశాల, హరి పులిజల, జస్వంత్ నాడిపల్లి నిర్మాత‌లు. ముహుర్త‌పు స‌న్నివేశానికి అన‌కాప‌ల్లి ఎమ్మెల్యే పీల గోవింద్ సత్యనారాయణక్లాప్ కొట్ట‌గా, మ‌ల‌శాల ధ‌న‌మ్మ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

     హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా

    హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా

    దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ... "ఈ సినిమా ద్వారా కొత్త సుశాంత్ ని చూస్తారు. రియ‌ల్ లైఫ్‌లో సుశాంత్ ఎలా ఉంటాడో నాకు తెలుసు. ఈ సినిమాలో త‌న‌ను అలాగే చూపిస్తున్నాను. టైటిల్ విని ఇది ట్ర‌యంగిల్ ల‌వ్‌స్టోరీ అనుకోవ‌ద్దు. సినిమా చూస్తే తెలుస్తుంది. నాకు స్టోరీ టెల్లింగ్ అంటే ఇష్టం ఉండ‌టంతో ద‌ర్శ‌కుడిగా మారాను. హీరోగా కూడా సినిమాలు చేస్తాను. ఈ సినిమా త‌ర్వాత హీరోగా ఓ సినిమా చేయ‌బోతున్నాను`` అన్నారు.

     కథ బాగా నచ్చి చేస్తున్నా

    కథ బాగా నచ్చి చేస్తున్నా

    హీరో సుశాంత్ మాట్లాడుతూ "కథ బాగా నచ్చి చేస్తున్న సినిమా ఇది, రాహుల్ చాలా అద్భుతంగా ఈ చిత్రం తెరకెక్కిస్తాడాని నమ్మకం ఉంది. చాలా గ్యాప్ తరువాత మంచి లవ్ స్టొరీ తో ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది`` అన్నారు..

     సినిమా అంటే ఉన్న ప్యాష‌న్‌ ఉంది

    సినిమా అంటే ఉన్న ప్యాష‌న్‌ ఉంది

    నిర్మాత‌ల్లో ఒక‌రైన భ‌ర‌త్‌కుమార్ మ‌ల‌శాల మాట్లాడుతూ - ``సినిమా అంటే ఉన్న ప్యాష‌న్‌తో ఈ రంగంలోకి అడుగుపెట్టాం. జ‌శ్వంత్ చెప్పిన ఈ ల‌వ్‌స్టోరీ బావుంది. కొత్త‌గా ఉండ‌టంతో సినిమా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. రాహుల్‌గారి మీద నమ్మకం ఉంది, సుశాంత్‌గారితో సినిమా చేయడం ఆనందంగా ఉంది`` అన్నారు.

    టెక్నీషియన్స్

    టెక్నీషియన్స్

    ఈ చిత్రానికి నిర్మాతలు: భరత్ కుమార్ మలశాల, హరి పులిజల, జస్వంత్ నాడిపల్లి, కెమెరామెన్: ఎం.సుకుమార్, సంగీతం: ప్రశాంత్ విహారి, ఎడిటర్: చోట కె ప్రసాద్, ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్: హరీష్ కోయిల గుండ్ల, ఆర్ట్ డైరెక్టర్: వినోద్ వర్మ, చీప్ కో డైరెక్టర్: డి. సాయి కృష్ణ, ప్రొడక్షన్ కంట్రోలర్: రవికుమార్ యండమూరి.

    English summary
    Chilasow (Chiranjeevi Lakshmi Sowbhagyavati) Telugu Movie Opening event held at Ramanaidu Studios, Hyderabad. Director Rahul Ravindran, Actor Sushanth, Actress Ruhani Sharma, Anakapalle MLA Peela Govinda Satyanarayana, Cinematographer M Sukumar at the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X