Just In
- 39 min ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 9 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
- 10 hrs ago
అభిమాని పెళ్లిలో సడన్గా ప్రత్యక్షమైన స్టార్ హీరో.. అతిధులంతా షాక్!
- 11 hrs ago
రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆ రూమర్స్ అన్ని అబద్ధాలే!
Don't Miss!
- News
కుటుంబమంతా నగ్నంగా పూజలు.. మృతదేహంపై ముగ్గు వేసి... మదనపల్లె కేసులో భయంకర నిజాలు
- Automobiles
ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివరాలు
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన వాడు.. ఆత్మహత్య పరిష్కారం కాదు.. సుశీల్ మృతిపై సెలెబ్రిటీల రియాక్షన్
కన్నడ పరిశ్రమలో మరో విషాదం జరిగింది. బుల్లితెర యువ తార సుశీల్ గౌడ ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరికీ కుదిపేస్తోంది. వెండితెరపై ఎన్నో శిఖరాలు అధిరోహించాలని కలలుగన్న సుశీల్ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంపై కన్నడ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తోంది. అంతపుర సీరియల్‌లో అందరికీ దగ్గరైన సుశీల్.. సాలాగా చిత్రంతో వెండితెరపైనా విజృంభించేందుకు సిద్దమయ్యాడు. కానీ అంతలోపే తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు.

సుశీల్ ఆత్మహత్య..
కన్నడ బుల్లితెర స్టార్ సుశీల్ మాండ్యలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అయితే ఇంత వరకు ఆయన ఆత్మహత్యకు గల కారణాలు బయటకు రాలేదు. ఆయన మరణ వార్తను తెలుసుకున్న తోటీ నటీనటులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

దునియా విజయ్ స్పందిస్తూ..
సాలాగా చిత్ర దర్శకుడు, హీరో దునియా విజయ్ స్పందిస్తూ.. ‘ఓ మంచి హీరో అయ్యే లక్షణాలన్నీ అతడిలో ఉన్నాయని నేను అతడ్ని చూసిన మొదటి క్షణంలోనే అనుకున్నాను. సినిమా రిలీజ్ కాకముందే మన అందర్నీ వదిలిపెట్టి వెళ్లిపోవడం దురదృష్టకరం. ఏ సమస్యకైనా సరే ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. కరోనా కంటే ఎక్కువగా.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జీవితం మీదే ఎక్కువగా భయం, నమ్మకం కోల్పోవడం జరుగుతోంది. మనమంతా ధైర్యంగా నిలబడాలి.. ఇలాంటి వాటిని దాటాల'ని చెప్పుకొచ్చాడు.

అరవింద్ కౌశిక్ స్పందిస్తూ
అంతపుర ధారావాహిక దర్శకుడు అరవింద్ కౌశిక్ స్పందిస్తూ.. ఓ చెడ్డ వార్తను నేను విన్నాను. నేను దర్శకత్వం వహించిన అంతపుర అనే సీరియల్‌లో హీరోగా నటించిన సుశీల్ ఇకలేడు. ఆత్మకు శాంతి చేకూరాల'ని కోరుకున్నాడు.

హీరోయిన్ అమిత రంగనాథ్
అంతపుర ధారావాహిక సీరియల్ హీరోయిన్ అమిత రంగనాథ్ స్పందిస్తూ.. ‘నా స్నేహితుల ద్వారా ఈ వార్తను విన్నాను. ఆయన లేరనే వార్తను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆయన తన శాంతాన్ని ఎప్పుడూ కోల్పోలేదు.. ఎంతో మృధుస్వభావి.. సాఫ్ట్ పర్సన్. ఇంత త్వరగా మనల్ని విడిచి పెట్టి వెళ్లడం ఎంతో బాధాకరం. వినోద రంగంలో ఎంతో సాధించగలిగే ప్రతిభ గలవాడ'ని ఎమోషనల్ అయింది.