»   »  బ్యూటీ క్వీన్.. డైరక్టర్ అవుతోందోచ్...

బ్యూటీ క్వీన్.. డైరక్టర్ అవుతోందోచ్...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sushmita Sen
అప్పట్లో రక్షకుడు సినిమా లో నాగార్జున సరసన హీరోయిన్ గా కనిపించిన సుస్మితా సేన్ త్వరలో డైరక్టర్ కుర్చీలో కూర్చోబోతోంది. ఆమె తన హోమ్ ప్రొడక్షన్ లో నిర్మించతలపెట్టిన రాణి లక్ష్మీబాయ్ చిత్రాన్ని ఆమే స్వయంగా డైరక్ట్ చేయబోతోంది. ఈ విషయాన్ని ఆమె వివరిస్తూ...మొదట ఈ ప్రాజెక్టును చేపట్టమని ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ ని కలిసిందిట.

అయితే ఆయన పానీ అనే చిత్రంలో బిజీగా ఉన్నాడుట. అయితే సుస్మిత చెప్పిన కథ పూర్తిగా విన్నాడుట. ఆమె ఎంతో ఆసక్తి రేపే విధంగా చెబుతున్న నేరేషన్ ఆయనకు బాగా నచ్చిందిట. దాంతో ఆయనకు ఆ ప్రాజెక్టు పై ఆమె కు ఎంత ప్యాషన్ ఉందో అర్ధమైందిట. వెంటనే ఆమెకు కంగ్రాట్స్ చెప్పి డైరక్టర్ వి అవమని దీవించేడుట. ఆమె కూడా మరో మాట లేకుండా సరే నందిట. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభమవుతోందిట. మనం కూడా బెస్టాఫ్ లక్ చెబుదాం...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X