For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మళ్లీ యముడు భూలోకానికి... ( 'యమలీల 2' ప్రివ్యూ)

  By Srikanya
  |

  హైదరాబాద్ : తెలుగునాట యముడి కథ ఎవర్‌గ్రీన్‌ ఫార్ములా. యముడు గద పట్టుకొని భూలోకం వస్తే... థియోటర్లు దద్దరిల్లుతాయి. భాక్సాఫీస్ కలెక్షన్స్ తో పండుగ చేసుకుంటుంది. దాంతో స్టార్‌ హీరోలంతా యముడి బాట పడితే - ఓ హాస్యనటుడిని హీరోగా మార్చి, యమ ఫార్ములాతో మాయ చేసిన ఘనత ఎస్వీ కృష్ణారెడ్డిది. అలీ హరోగా ప్రమోషన్‌ దక్కించుకొన్న 'యమలీల' ఎంత సందడి చేసిందో మనకందరికీ గుర్తే. ఇప్పుడు ఆ చిత్రానికి రెండో భాగం సిద్ధమైంది. అదే 'యమలీల 2'. అదే ఈ రోజు విడుదల అవుతోంది.

  కథ విషయానికి వస్తే..చిత్రగుప్తుడు చేసిన చిన్న తప్పు వల్ల యమలోకంలో గందరగోళం మొదలవుతుంది. చివరికి యముడే స్వయంగా భూలోకానికి రావల్సిన పరిస్థితి వస్తుంది. వచ్చిన తరవాత ఇక్కడ యముడికి, చిత్రగుప్తుడికి రకరకాల పరిస్థితులు ఎదురౌతాయి. మరో ప్రక్క ఇక్కడ భూలోకంలో ఉన్న ఓ కుర్రాడు(సతీష్) ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను దక్కించుకునే క్రమంలో అనుకోని ఇబ్బందుల్లో చిక్కుకుంటాడు. మధ్యలో ఓ చిన్న పిల్ల కూడా ఉంటుంది. ఆ క్రమంలో ఆ యువకుడు ప్రేమ ఎలా సక్సెస్ అయ్యింది ? వీరి ప్రేమకు యముడు ఎలా సాయం చేశారు? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. మంచు మోహన్‌బాబు యముడిగా, బ్రహ్మానందం చిత్రగుప్తుడిగా నటిస్తున్నారు. సతీష్‌ ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. దియా నికోలస్‌ హీరోయిన్.

  మోహన్‌బాబు మాట్లాడుతూ... ''నాకు నటుడిగా నలభై యేళ్లు వచ్చాయి. అయినా ఎస్వీ కృష్ణారెడ్డితో ఒక్క సినిమా కూడా చేయలేదు. యమలీల-2తో ఆ అవకాశం దక్కింది. అందులో యుముడుగా నాతో నటింపజేశారు.నిజానికి పౌరాణికాలు చేయాలంటే భారతదేశంలో అన్నయ్య దివంగత నందమూరి తారకరామారావుగారి తర్వాతే ఎవరయినా. వాటిల్లో అన్నే ఆది గురువు. అంతా ఆయనను ఆచరించాల్సిందే. ఇంటిల్లిపాదీ చూసేలా ఈ చిత్రాన్ని ఎస్వీ తీ ర్చారు. సతీష్‌ ధైర్యంగా నటించాడు. పాటల్లా సినిమా కూడా విజయవంతం అవుతుందని నా ఆశ''. అన్నారు.

  SV Krishna Reddy's Yama Leela-2 preview

  బ్రహ్మానందం మాట్లాడుతూ... 20ఏళ్ల క్రితం వచ్చిన యమలీల చిత్రంలో నేను చిత్రగుప్తుడిగా నటించాను. ఇప్పుడు అదే పాత్రను చేయడం ఆనందంగా వుంది. యమలీల చిత్రంలో సత్యనారాయణగారు యమధర్మరాజుగా నటిస్తే...యమలీల-2లో మోహన్‌బాబు ఆ పాత్ర చేశారు. సినిమాలో మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. షాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, గబ్బర్‌సింగ్ గ్యాంగ్ కామెడీ కూడా బాగుంటుంది అన్నారు.

  హీరో కె.వి.సతీష్ మాట్లాడుతూ.., ''మంచి కథా కథనం, ఉత్తమ సంగీత సాహిత్యాలతో ఎస్వీకృష్ణారెడ్డి ప్రేక్షకుల ముందుంచిన వినోదాల విస్తరి. యువత, కుటుంబ ప్రేక్షకులూ అంతా చూడాల్సిన సినిమా ఇది. ప్రతి చిన్న అంశం గురించీ దర్శకుడు తీసుకొన్న శ్రద్ధ వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. థియేటర్లలో సినిమా చూస్తే వచ్చే ఆనందం పైరసీల్లో రాదు. కాబట్టి పైరసీ వైపు చూడకండి'' అన్నారు.

  దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ... ''ఈ సినిమా యమలీలకి కొనసాగింపు కాదు. దానికి మించిన వినోదాన్ని అందిస్తాం. కొత్తకథ, పాటలు, సంగీతం, హాస్యం, యాక్షన్‌, గ్రాఫిక్స్‌...ఇలా అన్నీప్రేక్షకులను అలరించేవే. సతీష్‌ నృత్యం, సంభాషణోచ్ఛారణ, హావభావ ప్రకటన, పోరాటాలు, నటన... వెరసి ఏ హీరోకి తీసిపోనట్టు తెరపై మెరుస్తాడు. ప్రేక్షకులకి నచ్చుతాడు. ఎన్టీఆర్‌ తర్వాత యముడెవరంటే? మోహన్‌బాబుగారే అనిపిస్తారు ఇందులో. మెప్పిస్తారు. సినిమాకి తప్పకుండా ప్రేక్షకాదరణలభిస్తుంది'' అన్నారు.

  బ్యానర్: క్రిస్వీ ఫిలిమ్స్‌

  సినిమా: యమలీల-2

  నటీనటులు:మోహన్‌బాబు, డాక్టర్ కేవీ.సతీష్(తొలిపరిచయం), దియా నికోలస్(తొలి పరిచయం), బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్.నారాయణ, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, సదా, నిషాకొఠారి, ఆశిష్‌విద్యార్థి, తాగుబోతు రమేష్ తదితరులు

  కెమెరా: శ్రీకాంత్ నారోజ్,

  మాటలు: గంగోత్రి విశ్వనాథ్, భవానీ ప్రసాద్,

  ఎడిటింగ్:గౌతంరాజు,

  నిర్మాత:ఆశా సతీష్,

  కథ, స్క్రీన్‌ప్లే,సంగీతం,దర్శకత్వం: ఎస్‌వి.కృష్ణారెడ్డి

  విడుదల తేదీ: 28 నవంబర్, 2014

  English summary
  Director S.V. Krishna Reddy is all set to make a comeback to movies through Yamaleela 2, which is releasing today, November 28. Yamaleela 2 is a fantasy drama, inspired by his own earlier movie Yamaleela (1994). This socio-fantasy film stars Dr. K. V. Satish, DiahNicolas, Dr. M Mohan Babu, Dr. Brahmanandam, etc.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X