»   » రెస్పాన్స్ అదిరింది...ట్విట్టర్లో థ్రిల్లైన మహేష్ బాబు

రెస్పాన్స్ అదిరింది...ట్విట్టర్లో థ్రిల్లైన మహేష్ బాబు

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆడియో నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఆడియోకు మ్యూజిక్ లవర్స్ నుంచి అద్భుతమైన రెస్సాన్స్ వస్తుండటంతో మహేష్‌కు ఎంతో థ్రిల్లవుతున్నారు. ఈ ఆనందాన్ని ఆపుకోలేక సంగీత దర్శకుడు మిక్కీజే మేయర్‌ను అభినందిస్తూ...ట్విట్టర్ ద్వారా మనసులోని మాటలను బయట పెట్టారు మహేష్ బాబు.

  అప్పుడప్పుడు మాత్రమే తన సోషల్ నెట్వర్కింగ్ ను ఉపయోగించే మహేష్ బాబు...చాలా కాలం తర్వాత అందులో పోస్టులు చేసారు. తన చిత్రానికి మిక్కీజే మేయర్ అద్భుతమైన సంగీతం అందించడమే ఇందుకు కారణం. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం ఆడియోకు ఔట్ స్టాండింగ్ రెస్పాన్స్ వస్తోంది. బెస్ట్ మ్యూజిక్ అందించినందుకు మిక్కీజే మేయర్‌కు థాంక్స్. నా అభిప్రాయం ప్రకారం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆల్బం ఎంతో గొప్పది' అంటూ మహేష్ బాబు ట్వీట్ చేసారు.

  అదే విధంగా ఈ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలను కూడా ప్రశంసలతో ముంచెత్తారు మహేష్ బాబు. 'ఈచిత్రం సంగీతం, సినిమా, పెర్ఫార్మెన్స్ ఇలా అన్నీ అద్భుతంగా రావడానికి కారణం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాంటి వ్యక్తితో కలిసి పని చేయడాన్ని గర్వంగా ఫీలవుతున్నాను. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ' మహేష్ బాబు తన మనసులోని మాటలను నిర్మొహమాటంగా బయట పెట్టారు.

  ఈచిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తుండగా, వెంకటేష్ సరసన జర్నీ ఫేం అంజలి మరో హీరోయిన్ రోల్ చేస్తోంది. రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమా ప్రభ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, సంగీతం: మిక్కీ జే మేయర్, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, పాటలు: సిరి సీతారామశాస్త్రి.

  English summary
  On his Twitter page, Mahesh Babu, who usually is not active on the social networking site very often, went gaga over Mickey J Meyer's music for Seethamma Vakitlo Sirimalle Chettu. The actor tweeted, "Svsc audio gets an outstanding response.:) :) thank you mickey for giving ur best.....:) u deserve every bit if it... :)" Prince added, "In my opinion , d album of svsc. Is a masterpiece..."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more