For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షాకైన ‘స్పైడర్’ విలన్: పెళ్లిలో సమంత కంటతడి పెడితే ఇలా చేస్తారా?

  By Bojja Kumar
  |

  'స్పైడర్' చిత్రంలో విలన్ గా నటించిన ఎస్.జె.సూర్య క్యారెక్టరైజేషన్ ఎంత భయంకరంగా ఉందో సినిమా చూసిన వారికి ప్రత్యేకంగా చెప్పర్లేదు. ఎవరైనా ఏడిస్తే చూస్తే సంతోషపడే సైకోమనస్తత్వం. సినిమాలో సూర్య నటనకు మంచి పేరొచ్చింది.

  రెండు రోజుల క్రితం సమంత-నాగ చైతన్య వివాహం జరిగింది. మెడలో మూడుముళ్లు పడగానే సమంత భావోద్వేగానికి గురైంది. పెళ్లి పీటలపైనే ఏడ్చేసింది. ఇపుడు సమంత ఏడుపు చూస్తూ ఎస్.జె.సూర్య సంతోష పడుతున్నట్లు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జస్ట్ ఫన్ కోసం అభిమానులు ఇలా చేశారు.

  ఓ మై గాడ్ వాట్ ఈజ్ దిస్

  ఓ మై గాడ్ వాట్ ఈజ్ దిస్

  ఈ ఫోటో ఎస్.జె.సూర్య దృష్టికి వెళ్లడంతో షాకయ్యాడు. ఓ మై గాడ్ వాట్ ఈజ్ దిస్ అంటూ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.

  సమంత ఏడిచింది బాధతో కాదు, సంతోషంలో..

  సమంత ఏడిచింది బాధతో కాదు, సంతోషంలో..

  అయినా సమంత కంటతడి పెట్టింది బాధతో కాదు.... పట్టలేని సంతోషంతో ఆమె ఎమోషనల్ అయ్యారు. స్పైడర్ విలన్ సైకో మనస్తత్వానికి, సమంత సంతోషంతో కంటతడి పెట్టిన సందర్భానికి అసలు సింక్ కాదని కొందరి అభిప్రాయం. ఇది జస్ట్ ఫర్ ఫన్ కోసమే కాబట్టి అంతా లైట్ తీసుకున్నారు.

  స్పైడర్ విలన్ పాత్ర

  స్పైడర్ విలన్ పాత్ర

  'స్పైడర్' సినిమా చూసిన తర్వత ప్రేక్షకులకు ఎక్కువ కాలం గుర్తిండిపోయే పాత్ర ఏది అంటే... చాలా మంది తడముకోకుండా 'బైరవుడు' పాత్రే అని చెబుతున్నారు. ఇలాంటి సైకో పాత్రను ఇప్పటి తాము చూడలేదంటున్నారు.

  ఒళ్లు గగుర్బొడిచే క్యారెక్టర్

  ఒళ్లు గగుర్బొడిచే క్యారెక్టర్

  ‘స్పైడర్' మూవీలో భైరవుడు సైకో క్యారెక్టర్ ఒళ్లు గగుర్బొడిచేలా ఉంది. ప్రతి మనిషిలోనూ సైకోయిజం ఉంటుంది. సాధారణ వ్యక్తుల్లో ఇది 4 శాతం ఉంటుంది. కొందరిలో 6 శాతం ఉంటుంది. అయితే ‘స్పైడర్' మూవీలో భైరవుడి పాత్రలో సైకోయిజం 15 శాతం ఉంది. అందుకే అతడి పాత్ర అంత క్రూరంగా, కిరాతకంగా ఉంది. బైరవుడి పాత్ర ఎలా పుట్టింది, అతడు అలా తయారవ్వడానికి కారణం ఏమిటి అనే వివరాలు మురుగదాస్ స్క్రీన్ మీద చూపించిన తీరు చాలా అద్భుతంగా ఉంది.

  అదీ భైరవుడి మెంటాలిటీ

  అదీ భైరవుడి మెంటాలిటీ

  సినిమాలో భైరవుడు తండ్రి కాటి కాపరి. అమ్మకడుపులో 9 నెలలు ఉన్నపుడే స్మశానంలో చనిపోయిన వారి బంధువుల ఆర్థనాదాలు, ఏడుపులు వింటూ పెరుగుతాడు. అమ్మ కడుపు నుండి భూమి మీద పడ్డ క్షణంలో అతడు విన్న శబ్దం కూడా ఏడుపే. అలా ఎదుటి వారు ఎవరైనా చనిపోయి ఏడుస్తుంటే చూసి ఎంజాయ్ చేసే మెంటాల్టీతో పెరుగుతాడు బైరవుడు.

  ఆరేళ్ల వయసులోనే హత్యలు

  ఆరేళ్ల వయసులోనే హత్యలు

  కొన్నిసార్లు ఊర్లో చావులు లేక స్మశానం వెలవెల పోతోంది. చావు ఏడుపులు వింటే తప్ప తిండి కూడా సహించని మనస్తత్వం భైరవుడిది. అతడి ప్రవర్తన చూసి తల్లిదండ్రులు కూడా విస్తుపోతారు. ఈ క్రమంలోనే భైరవుడు ఆనందం కోసం హత్యలు చేయడం మొదలు పెడతాడు.

  English summary
  S J Suryah who played the psycho character in Mahesh’s Spyde, Gets Happy Seeing Samantha Cry at Wedding. This pic goes viral in social media. Samantha fans created this pic just for fun.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X