»   » ‘సై...రా నరసింహారెడ్డి’....ఆ క్రెడిట్ రెహమాన్‌ది కాదు, తనదే అంటున్న థమన్!

‘సై...రా నరసింహారెడ్డి’....ఆ క్రెడిట్ రెహమాన్‌ది కాదు, తనదే అంటున్న థమన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా 'సై..రా నరిసంహా రెడ్డి' మోషన్ పోస్టర్ ఆవిష్కరణ మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా ఈ మోషన్ పోస్టర్లో వినిపించిన బ్యాగ్రౌండ్ స్కోర్‌కు స్పందన అద్భుతంగా వచ్చింది.

మోషన్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా చిత్ర ప్రధాన తారాగణంతో పాటు, టెక్నీషియన్స్ వివరాలు వెల్లడించారు. అందులో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నట్లు ప్రకటించారు కూడా. దీంతో ఈ మోషన్ పోస్టర్‌కు రెహమానే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడని అంతా భావించారు. కానీ అది కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్ కాదట.

తనదే ఆ క్రెడిట్ అంటున్న థమన్

తనదే ఆ క్రెడిట్ అంటున్న థమన్

నిజమే... ఆ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించింది రెహమాన్ కాదు, ఎస్ఎస్ థమన్. ఈ విషయాన్ని థమన్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ విషయం తెలిపారు.

Chiranjeevi's 151 movie "SAIRA" Motion Poster Released.
థమన్‌ను తప్పించారు

థమన్‌ను తప్పించారు

వాస్తవానికి ఈ సినిమాకు తొలుత థమన్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. అప్పుడు ఈ ప్రాజెక్టు కేవలం తెలుగులో చేద్దామనే ఆలోచన మాత్రమే ఉంది. ఎప్పుడైతే ‘సై..రా నరసింహా రెడ్డి' చిత్రాన్ని నేషనల్ వైడ్ ప్రాజెక్టుగా చేద్దామని డిసైడ్ అయ్యారో..... అప్పుడే థమన్‌ను తప్పించాలని నిర్ణయించారు.

కారణం ఏమిటి?

కారణం ఏమిటి?

థమన్‌ను తప్పించడానికి పెద్దగా కారణం ఏమీ లేదు, అతడిలో టాలెంట్ లేదనీ కాదు. అతడికి లేనిదల్లా నేషనల్ వైడ్ గుర్తింపు. పెద్ద ప్రాజెక్టు చేస్తున్నపుడు ఏఆర్ రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే హైప్ మరింత ఎక్కువ వస్తుందనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట.

కన్విన్స్ అయిన థమన్

కన్విన్స్ అయిన థమన్

తనది రెహమాన్ స్థాయి కాదు కాబట్టి.... రామ్ చరణ్, సురేందర్ రెడ్డి చెప్పగానే కన్విన్స్ అయిన థమన్ ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడు. పోస్టర్ రిలీజ్ సమయానికి కొద్ది రోజుల ముందే ఈ నిర్ణయం జరిగింది. ఈ గ్యాపులో రెహమన్ మోషన్ పోస్టర్ కు మ్యూజిక్ అందించే సమయం కూడా లేదు. అందుకే తన ఫ్రెండ్ అయిన థమన్‌ను ఒప్పించి బ్యాగ్రౌండ్ స్కోర్ కొట్టించారు సురేందర్ రెడ్డి.

కనీసం క్రెడిట్ ఇవ్వక పోవడంపై థమన్ అప్ సెట్

కనీసం క్రెడిట్ ఇవ్వక పోవడంపై థమన్ అప్ సెట్

అయితే తనతో ‘సై..రా నరసింహా రెడ్డి' మోషన్ పోస్టర్‌కు బ్యాగ్రౌండ్ స్కోర్ చేయించుకుని కనీసం తనకు క్రెడిట్ ఇవ్వక పోవడంపై థమన్ అప్ సెట్ గా ఉన్నట్లు టాక్.

అందుకే తనే ప్రచారం చేసుకున్నాడు

అందుకే తనే ప్రచారం చేసుకున్నాడు

ఈ విషయంలో రామ్ చరణ్ గానీ, సురేందర్ రెడ్డి గానీ తనకు క్రెడిట్ ఇవ్వక పోవడంతో........ ఈ విషయాన్ని తానే ప్రచారం చేసుకున్నాడు. తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడిచారు. అంతే కాదు తన బ్యాగ్రౌండ్ స్కోర్ బావుందని పొగుడుతూ ట్వీట్స్ చేసిన వారి ట్వీట్స్ అన్నీ రీ ట్వీట్స్ చేశాడు.

నిన్నంతా అదే పనిలో థమన్, వందల్లో రీట్వీట్లు

నిన్నంతా అదే పనిలో థమన్, వందల్లో రీట్వీట్లు

థమన్ ఈ విషయం తన ట్విట్టర్ ద్వారా ప్రకటించగానే..... వందల మంది థమన్ అభిమానులు ట్వీట్లు చేశారు. వారు చేసిన ప్రతీ ట్వీట్‌ను థమన్ రీట్వీట్ చేశారు. థమన్ ట్విట్టర్ పేజీలోకి వెళితే ఇందుకు సంబంధించిన వందల్లో రీ ట్వీట్లు తప్ప మరేమీక కనిపించడం లేదు.

ఛాన్స్ మిస్

ఛాన్స్ మిస్

మెగాస్టార్ చిరంజీవి సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం కోసం థమన్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి ఇలా చేయి జారడంతో థమన్ చాలా అప్ సెట్లో ఉన్నారట.

English summary
Young music director SS Thaman revealed the inside news through his official twitter page. It was SS Thaman who was initially roped in as the music composer for Syeraa Narasimha Reddy however once the movie has been planned in multiple languages, the makers wanted National wide music director AR Rahaman. Surendar Reddy managed to complete the background score with the help of thaman.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu