For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెగా ఫ్యాన్స్‌కు ఊహించని షాక్... ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా!

|

తమ అభిమాన హీరో సినిమా థియేటర్లలోకి వచ్చినపుడు ఫ్యాన్స్ ఎంత సంతోషిస్తారో... వారిని నేరుగా దగ్గర నుంచి చూసినపుడు అంతకంటే ఎక్కువ ఆనందిస్తారు. ఆడియో రిలీజ్ లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ సందర్భంగా వారికి ఇలాంటి అవకాశం దక్కుతుంది. మెగా అభిమానులంతా సెప్టెంబర్ 18న జరిగే 'సైరా నరసింహారెడ్డి' వేడుక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

హైదరాబాద్‌లో జరిగే ఈ వేడుకలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల్లో ఉండే మెగా అభిమానులు తమ ప్రయాణానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కొందరు ముందస్తుగానే బస్సు, రైలు టికెట్ బుక్ చేసుకుని ఒక రోజు ముందు హైదరాబాద్ చేరేందుకు సన్నద్ధం అయ్యారు. అయితే వారికి ఒక షాకింగ్ న్యూస్. 'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది.

‘సైరా’ ఈవెంట్ వాయిదా... మళ్లీ ఎప్పుడంటే?

‘సైరా’ ఈవెంట్ వాయిదా... మళ్లీ ఎప్పుడంటే?

చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 18న జరుగాల్సిన వేడుక సెప్టెంబర్ 22నకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు. సోమవారం రాత్రి వకు ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఎందుకు వాయిదా వేశారు?

ఎందుకు వాయిదా వేశారు?

అయితే ఈవెంట్ వాయిదా పడటానికి కారణం ఏమిటో ఇంకా తెలియరాలేదు. సెప్టెంబర్ 18న తనకు రావడం వీలుపడదని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పడంతో... ఆయన్ను చీఫ్ గెస్టుగా రప్పించాలనే ఉద్దేశ్యంతోనే ఈవెంట్ వాయిదా వేసినట్లుగా ఓ ప్రచారం తెరపైకి వచ్చింది.

వాయిదాకు అది కూడా ఓ కారణమా?

వాయిదాకు అది కూడా ఓ కారణమా?

ఏపీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు మరణం ‘సైరా' ఈవెంట్ వాయిదా పడటానికి ఓ కారణం అయి ఉండొచ్చనే వాదన ఉంది. ఏది ఏమైనా చిత్ర బృందం నుంచి ఈ విషయమై అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి' దర్శకత్వం చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం ఇలా వివిధ భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా దీన్ని విడుదల చేస్తున్నారు.

సైరా

సైరా

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరా సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు నయనతార, జగపతి బాబు, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, తమన్నా, సుదీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అమిత్ త్రివేది పాటలకు సంగీతం అందించగా, జూలియస్ ప్యాకియం బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చారు.

English summary
“Sye Raa Narasimha Reddy” pre release event of has been postponed from 18th September from 22nd September. Sye Raa Narasimha Reddy is an upcoming Indian Telugu-language biographical epic action film directed by Surender Reddy and produced by Ram Charan under the Konidela Production Company banner. The film will be dubbed and released in Hindi, Kannada, Malayalam and Tamil.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more