»   » ‘సైరా’ సెట్ కూల్చి వేశాక... రామ్ చరణ్ షార్ప్ డెసిషన్, ఆగమేఘాల మీద...

‘సైరా’ సెట్ కూల్చి వేశాక... రామ్ చరణ్ షార్ప్ డెసిషన్, ఆగమేఘాల మీద...

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Sye Raa Movie New Set Ready For Shooting

  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' సినిమాకు సంబంధించిన హైదరాబాద్‌లో వేసిన సెట్ ప్రభుత్వ అధికారులు కూల్చి వేయడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా ప్రభుత్వ భూమిలో అక్రమంగా సెట్ వేయడంతో రంగంలోకి దిగిన గవర్నమెంట్ అఫీషియల్స్ శేరిలింగంపల్లిలో వేసిన మూవీ సెట్‌ను నేలమట్టం చేశారు. మెగాస్టార్ మూవీ, అందులోనూ ఇది ఆయన తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నది కావడంతో ఈ విషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది.

  ఈ ఇష్యూపై స్పందించడానికి నో...

  ఈ ఇష్యూపై స్పందించడానికి నో...

  ఈ ఇష్యూపై స్పందించడానికి చిత్ర బృందం ఇష్టపడలేదు. దీనిపై మీడియాలో రకరకాల వార్తలు వచ్చినా ‘సైరా' బృందం నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. ఏదైనా మాట్లాడితే అది మరో సమస్యకు దారి తీస్తుందనే అంతా సైలెంటుగా ఉన్నట్లు సమాచారం.

   షార్ప్ డెసిషన్ తీసుకున్న రామ్ చరణ్

  షార్ప్ డెసిషన్ తీసుకున్న రామ్ చరణ్

  అయితే సెట్ కూల్చివేతకు కొన్ని రోజుల ముందే నిర్మాత రామ్ చరణ్‌కు అధికారుల నుండి నోటీసులు వచ్చినట్లు తెలుస్తోంది. నోటీసులు వచ్చిన వెంటనే రామ్ చరణ్ షార్ప్ డెసిషన్ తీసుకున్నారట. వెంటనే మరో చోట సెట్ వేయించారట.

  ఆగమేఘాల మీద పనులు పూర్తి

  ఆగమేఘాల మీద పనులు పూర్తి

  షూటింగ్ ఆలస్యం అయితే సినిమాకు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో ఈ విషయంలో ఎలాంటి సమస్య తలెత్తకుండా ఆగమేఘాల మీద మరో సెట్ సిద్ధం చేశారట. నాలుగు రోజుల క్రితమే సెట్ పూర్తయినట్లు తెలుస్తోంది.

   షూటింగకు సిద్ధమైన కొత్త సెట్

  షూటింగకు సిద్ధమైన కొత్త సెట్

  కొత్త సెట్ షూటింగుకు సిద్ధమైందని, తాజాగా అక్కడ చిత్రీకరణ మొదలు పెట్టేందుకు ‘సైరా' టీమ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నెలరోజులపాటు ఏకధాటిగా షూటింగ్ చేయనున్నట్టు సమాచారం. ఈ సెట్‌లోనే బ్రిటిషర్లతో సైరా నరసింహారెడ్డికి మధ్య జరిగే పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తారట.

  చిరంజీవి బర్త్ డే స్పెషల్

  చిరంజీవి బర్త్ డే స్పెషల్


  ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పెట్టినరోజు పురస్కరించుకుని సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అభిమానులు దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  English summary
  Sye Raa new set ready for shooting, Earlier this week, the revenue officials of Serilingampally mandal demolished the sets of Chiranjeevi starrer Sye Raa Narasimha Reddy as the filmmakers apparently did not have the required permission from the authorities.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more