Don't Miss!
- Technology
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- News
YS Jagan, Chandrababu : జగన్, చంద్రబాబుకూ సంక్షేమ సవాల్ ! లబ్దిదారుల డిమాండ్లు ఇవే..!
- Finance
Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ఇక ఒక్కరోజే టైమ్.. జాగ్రత్త ట్రేడర్స్
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Automobiles
కుర్రకారుని ఉర్రూతలూగించే 'అల్ట్రావయోలెట్ F77 రీకాన్' రివ్యూ.. ఫుల్ డీటైల్స్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
సైరా టీజర్‌కు ముందు చిరు, చెర్రీతో ప్రభాస్.. ముంబైలో ఏం జరిగిందంటే!
తెలుగు సినిమా సత్తా బాలీవుడ్‌ను తాకింది. గతంలో బాహుబలి సినిమా చరిత్ర తిరుగరాస్తే.. ఇప్పుడు మరోసారి సినీ చరిత్రను లిఖించడానికి సాహో, సైరా సినిమాలు రెడీగా ఉన్నాయి. హిందీ సినీ పరిశ్రమలో హిస్టరీ క్రియేట్ చేయడానికి, ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచడానికి రెడీ అవుతున్నాయి.
కొద్ది రోజుల క్రితం సాహో హిందీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ముంబైలో ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో నిర్మాతలు వంశీ, ప్రమోద్‌తోపాటు హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధా కపూర్ పాల్గొన్నారు. సాహో ట్రైలర్‌కు అన్ని భాషల్లోనూ విశేష స్పందన వచ్చింది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

ఇక సాహో ట్రైలర్ రిలీజ్ తర్వాత మరోసారి టాలీవుడ్ టాలెంట్ బాలీవుడ్‌ను సర్‌ప్రైజ్ చేసింది. చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని రూపొందించిన సైరా టీజర్ ముంబైలో ఆగస్టు 20న విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, సురేందర్ రెడ్డి, తమన్నా, రవి కిషన్, హిందీలో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న హీరో ఫర్హాన్ అఖ్తర్ తదితరులు టీజర్ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు.
సైరా టీజర్‌కు ముందు అదే హోటల్‌లో బస చేసిన చిరంజీవి, రాంచరణ్‌ను ప్రభాస్ కలుసుకొన్నారు. వారి మధ్య కుశల ప్రశ్నలు జరిగాయి. అనంతరం ముగ్గురు తెలుగు సినీ ప్రముఖులు ఫొటోకు ఫోజిచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరంజీవి, ప్రభాస్, రాంచరణ్ ఫోటో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.