»   » స్టేజ్ మీదనే నానా మాటలూ అన్నాడు: కళ్ళనీళ్ళు పెట్టుకున్న ధన్సిక

స్టేజ్ మీదనే నానా మాటలూ అన్నాడు: కళ్ళనీళ్ళు పెట్టుకున్న ధన్సిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

కోలీవుడ్ లో మరోసారి ప్రముఖ నటుడు, దర్శకుడు టి. రాజేందర్ వివాదానికి కేంద్రమయ్యారు. చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో యువనటి ధన్షికపై శివాలెత్తిపోయారు. ధన్షిక ప్రసంగంలో తన పేరు ప్రస్తావించలేదని ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో ధన్షిక వేదికపైనే కన్నీటి పర్యంతమయింది.

వేదికపైనే కన్నీటి పర్యంతమయింది

వేదికపైనే కన్నీటి పర్యంతమయింది

ఎంత పొగరంటూ దుర్భాషలాడినంత పనిచేశారు. పొరపాటున మరచిపోయానని చెప్పినా రాజేందర్ లక్ష్యపెట్టలేదు. సారీ చెప్పినా కనికరించలేదు. ఘటన వివరాల్లోకి వెళ్తే... ‘విళితిరు' సినిమాలో ధన్షిక హీరోయిన్ గా నటించింది.

పేరు ప్రస్తావించడం మరచిపోయింది

పేరు ప్రస్తావించడం మరచిపోయింది

చిత్ర నిర్మాతలు తాజాగా ఈ సినిమా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అందులో పని చేసిన అందరి గురించి ప్రస్తావించిన ధన్షిక... రాజేందర్ పేరు ప్రస్తావించడం మాత్రం మరచిపోయింది. దీనిని అవమానంగా భావించిన ఆయన వేదికపైనే ఆమెకు చీవాట్లు పెట్టారు.

కబాలి సినిమాలో నటించినంత మాత్రాన

కబాలి సినిమాలో నటించినంత మాత్రాన

రజినీకాంత్‌ తో కబాలి సినిమాలో నటించినంత మాత్రాన స్టార్ హీరోయిన్లు అయిపోరని, పెద్దలను గౌరవించాలని హితవు పలికారు. సహచర ఆర్టిస్టులకు మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలని సూచించారు. పెద్ద ఆర్టిస్టులను గౌరవించడం నేర్చుకోకపోతే భవిష్యత్‌ ఉండదని హెచ్చరించారు.

పొరపాటు జరిగింది

పొరపాటు జరిగింది

దీంతో షాక్ తిన్న ధన్షిక వెంటనే తను చేసిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ, స్టేజ్ పై ప్రసంగించడం తనకు అలవాటు లేదని చెప్పింది. అందువల్లే పొరపాటు జరిగింది తప్ప తను కావాలని చేసింది కాదని తెలిపింది. దీంతో షాక్ తిన్న ధన్షిక వెంటనే తను చేసిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ స్టేజ్‌పై ప్రసంగించడం అలవాటు లేదని చెప్పింది.

చీరలో రాని నువ్వు.. సారీ చెప్తున్నావా?

చీరలో రాని నువ్వు.. సారీ చెప్తున్నావా?

అందువల్లే పొరపాటు జరిగిందని.. క్షమించాల్సిందిగా కోరింది. అయినా కనికరించని రాజేందర్.. చీరలో రాని నువ్వు.. సారీ చెప్తున్నావని చీవాట్లు పెట్టారు. నువ్విచ్చే గౌరవాన్ని తాను ఏ మార్కెట్లో అమ్ముకుంటానని కొట్టిపారేశారు. దీంతో ఖిన్నురాలైన ధన్షిక కన్నీటిపర్యంతమైంది. ఇంతకీ ఈ సినిమాలో టి.రాజేందర్ నటించలేదు... కేవలం ఒక పాట మాత్రమే పాడారు. అందుకే, ఆయనను మీడియా సమావేశానికి ఆహ్వానించారు.

English summary
On Thursday, Krishna, Vidharth, Dhansika and T Rajendar were seen promoting their forthcoming film Vizhithiru. While thanking the team and her co-stars, Dhansika reportedly left out T Rajendar's name, which, sort of, gave him the liberty to make unnecessary comments.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu