హైదరాబాద్‌లో శ్రీదేవి సంస్మరణ సభ.. చిరు, ఆర్జీవి, సినీ దిగ్గజాల హాజరు..
Recommended Video

దేశం గర్వించదగిన నటి, అందాల తార శ్రీదేవి సంస్మరణ సభ హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ప్రమాద వశాత్తూ శ్రీదేవి మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో సాయంత్రం 6.30 గంటలకు నిర్వహించనున్నట్టు ప్రముఖ నిర్మాత, రాజకీయవేత్త, ఎంపీ సుబ్బరామిరెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు.

సినీ దిగ్గజాలు హాజరు
శ్రీదేవి సంస్మరణ సభకు చిరంజీవి, మోహన్‌బాబు, నాగార్జున, జయప్రద, కే రాఘవేంద్రరావు, రాంగోపాల్ వర్మ, సురేష్ బాబు, అల్లు అరవింద్ లాంటి సినీ దిగ్గజాలు హాజరుకానున్నారు.

50 ఏళ్లకుపైగా
54 ఏళ్ల వయసు ఉన్న శ్రీదేవి భారత సినీ పరిశ్రమకు దాదాపు 50 ఏళ్లకుపైగా సేవలందించారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించారు.

అత్యంత ప్రజాదరణ
హిందీలో శ్రీదేవి నటించిన సద్మా, నగీనా, మిస్టర్ ఇండియా, ఖుదాగవా, చాందినీ, లమ్హే చిత్రాలు అత్యంత ప్రజాదరణ పొందాయి. తెలుగులో పదహారేళ్ల వయసు, జగదేకవీరుడు అతిలోక సుందరి, క్షణక్షణం చిత్రాలు విశేషంగా ఆకట్టుకొన్నాయి.

సుబ్బరామిరెడ్డికి ఆప్తులు
ఎంపీ సుబ్బరామిరెడ్డి కుటుంబానికి శ్రీదేవి అత్యంత అప్తురాలు. సుబ్బరామిరెడ్డి కూతురు పింకిరెడ్డికి మంచి స్నేహితురాలు. శ్రీదేవి నటించిన చాందినీ చిత్రానికి సుబ్బరామిరెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు.


Click it and Unblock the Notifications











